News February 28, 2025

HYD: కాళోజీ అవార్డు గ్రహీత జయరాజు పదవీ విరమణ

image

బజార్ ఘాట్‌లోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భవన్‌లో సింగరేణి కార్మికుడు, ప్రముఖ కవి, సినీగేయ రచయిత, కాళోజీ అవార్డు గ్రహీత, తెలంగాణ ఉద్యమకారుడు జయరాజు పదవీ విరమణ జరిగింది. ఈ పదవీ విరమణ సభకు ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అభినందనలు తెలిపారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు శాలువాతో సన్మానించారు.

Similar News

News February 28, 2025

NZB: DJ సౌండ్ ఎఫెక్ట్.. కుప్పకూలి వృద్ధురాలి మృతి

image

DJ సౌండ్ ఓ వృద్ధురాలి ప్రాణాలను బలిగొంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర బైపాస్ రోడ్‌లో జరిగింది. కలెక్టరేట్ వెళ్లే రహదారిలో నివాసముండే కె.భారతమ్మ (70) గురువారం రాత్రి తన ఇంటి సమీపంలో ఓ వేడుక జరుగుతుంటే చూడడానికి వెళ్లింది. అయితే అక్కడ DJ సౌండ్‌కు ఆమె అక్కడే కుప్పకూలగా హుటాహుటినా ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

News February 28, 2025

VZM: పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు

image

విజయనగరంలో ఓ యువకుడు పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. CI శ్రీనివాస్ వివరాల ప్రకారం.. నెయ్యిల వీధికి చెందిన పి.సాయికి మార్చిలో వివాహం జరగాల్సి ఉంది. కాగా ఈనెల 24 ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అనంతరం తల్లికి ఫోన్ చేసి పెళ్లి ఇష్టం లేదని చెప్పి కాల్ కట్ చేశాడు. యువకుడి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ CI కేసు దర్యాప్తు చేపట్టారు.

News February 28, 2025

గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించేలా..

image

AP: గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరిపై PIT-NDPS చట్టం కింద కేసు పెట్టి ఏడాది పాటు జైలు శిక్ష వేస్తోంది. తొలిసారిగా విజయవాడ పోలీసులు ఇద్దరిపై అభియోగాలు మోపారు. జిల్లాల వారీగా గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్ల జాబితా తయారు చేస్తున్నారు. ఇక నుంచి అరెస్ట్ అయ్యాక బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ మళ్లీ అవే నేరాలకు పాల్పడటం కుదరదని పోలీసులు వెల్లడించారు.

error: Content is protected !!