News January 11, 2025
HYD: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు. నేటి నుంచి విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. దీంతో పండగకు వెళ్లే వారితో మెట్రో రైళ్లలో రద్దీ నెలకొంది. మియాపూర్, రాయదుర్గం, అమీర్ పేట్, ఎంజీబీఎస్, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
Similar News
News January 11, 2025
HYD: పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్
ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 7వ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దాదాపు 50 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్.. 21 దేశాల నుంచి వస్తున్నారు. వీరంతా తమ తమ దేశాలకు సంబంధించిన గాలి పటాన్ని ఎగరవేయనున్నారు.
News January 11, 2025
శంషాబాద్: ప్రయాణికులు 2,3 గంటల ముందే చేరుకోవాలి
శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే దేశీయ,అంతర్జాతీయ ప్రయాణికులు తమ ప్రయాణ సమయానికి 2,3 గంటల ముందే చేరుకోవాలని అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని సకాలంలో విమానాశ్రయానికి చేరుకోవాలన్నారు. తనిఖీల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా డీజీ యంత్రం సేవలను వినియోగించుకోవాలన్నారు.
News January 11, 2025
ఫార్ములా ఈ-రేస్ HYD ఇమేజ్ పెంచింది: దానం
ఫార్ములా ఈ-రేస్ HYD ఇమేజ్ పెంచిందని అనటంలో ఎలాంటి అనుమానం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గతంలోనే ఫార్ములా-1 కోసం మాజీ సీఎం చంద్రబాబు హయాంలో భూసేకరణ జరిగి, అంతా సిద్ధమైనా కొన్ని కారణాలతో అప్పుడు అది జరగలేదన్నారు. అంతర్జాతీయ దృష్టిని కేంద్రీకరించడంలో ఫార్ములా ఈ-రేస్ దోహద పడిందన్నారు. అవినీతి జరిగిందా? లేదా? అన్నది ACB, ED, కోర్టు చెప్పే వరకు స్పందించడం కరెక్ట్ కాదన్నారు.