News March 28, 2025
HYD: కూరల్లో నూనె అధికంగా వాడుతున్నారా?

కూరల్లో నూనె అధికంగా వాడేవారికి HYD ఫుడ్ సేఫ్టీ అధికారులు FSSAI సూచించిన సూచనలను ట్వీట్ చేశారు. తక్కువ నూనె వాడితే ఆరోగ్యానికి మంచిదని, ఊబకాయం వంటివి రాకుండా ఉండే అవకాశం ఉందన్నారు. రోజూ వాడే నూనెలో 10% నూనె తగ్గించినా గుండెపోటు, షుగర్, బీపీ లాంటివి వచ్చే రిస్క్ తగ్గుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ నూనె తక్కువగా వాడాలని FSO పవన్ కుమార్ సూచించారు.
Similar News
News April 2, 2025
భదాద్రి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యుల నియామకం

భద్రాద్రి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులుగా ప్రముఖ సీనియర్ న్యాయవాదులు లక్కినేని సత్యనారాయణ, అనుబ్రోలు రాంప్రసాద్ రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు జారీ చేసిన G.O. No.198 ప్రకారం వీరు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ నియామకం ద్వారా న్యాయ సేవాధికార సంస్థ మరింత బలోపేతం అవుతుందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
News April 2, 2025
గద్వాల జిల్లా పోలీసుల సీరియస్ WARNING

గతంలో ఎప్పుడో జరిగినా వివాదాలు పరిష్కారమై, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో తిరిగి వాటికి సంబంధించిన వీడియోలను మళ్లీ సోషల్ మీడియాలో పోస్టు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గద్వాల సీఐ శ్రీను హెచ్చరించారు. కావాలని పాత విభేదాలు కలిగి ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో మళ్లీ పోస్టు చేసే వారిపై, ఫేక్ న్యూస్‌ను వైరల్ చేసే వారిపై జిల్లా పోలీస్ వ్యవస్థ నిఘా పెట్టిందని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 2, 2025
నారాయణపేట: ‘విద్యార్థుల అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం’

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో అన్నారు. యూనివర్సిటీలో భూములను కాపాడేందుకు బీఆర్ఎస్ తరఫున విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా భూములు తీసుకునే విషయంలో వెనక్కి తగ్గాలని సూచించారు.