News February 19, 2025

HYD: కోళ్లకు రోగం వచ్చినట్లు గుర్తిస్తే.. కాల్ చేయండి..!

image

HYD, RR, MDCL జిల్లాల శివారు ప్రాంతాల్లో కోళ్లలో అసాధారణ మరణాలు, ఏవైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే హెల్ప్ లైన్ నంబర్ ద్వారా సమాచారం అందించాలని సంచాలకుడు గోపి సూచించారు. హెల్ప్ లైన్ నంబర్ 040-23314876 అందుబాటులో ఉంటుందని, ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బర్డ్ ఫ్లూ పట్ల భయాందోళన అవసరం లేదన్నారు.

Similar News

News December 21, 2025

టైర్లు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?

image

నేచురల్ రబ్బర్ నిజానికి తెల్లగా ఉంటుంది. కానీ వాహనాల టైర్లు నలుపు తప్ప మరో రంగులో కనిపించవు. దానికి ప్రధాన కారణం Carbon Black. దీన్ని రబ్బరుకు కలపడం వల్ల అది నల్లగా మారుతుంది. ఇది టైరుకు మంచి గ్రిప్ ఇస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే UV Rays తగలకుండా కాపాడుతుంది. దీనివల్ల టైర్లు త్వరగా అరిగిపోకుండా ఎక్కువ కాలం మన్నిక ఇస్తాయి.

News December 21, 2025

పెద్దపల్లి: ‘పులి సంచారంపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’

image

పెద్దపల్లి జిల్లాలోని ఎన్‌టీపీసీ, మల్యాలపల్లి, కుందనపల్లి, రాయదండి, లింగాపూర్, పాముల పేట, మేడిపల్లి, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, కమాన్పూర్, రామగిరి ప్రాంతాలలో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. కావున సంబంధిత మండలాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 9 గంటల మధ్య వ్యవసాయ క్షేత్రాలలో సందర్శించవద్దని తెలిపారు.

News December 21, 2025

బర్త్‌డే విషెస్‌.. థాంక్స్ చెప్పిన జగన్

image

AP: తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ స్పెషల్ డేను ఉత్సాహంగా నిర్వహించి, YCP కుటుంబం చూపించిన ప్రేమ, అభిమానానికి ఆనందిస్తున్నానని తెలిపారు. వారి మద్దతు తనకు గొప్ప బలాన్ని ఇస్తుందన్నారు. CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్, AP గవర్నర్ అబ్దుల్ నజీర్, PCC చీఫ్ షర్మిల, TG Dy.CM భట్టిని ట్యాగ్ చేస్తూ ధన్యవాదాలు చెప్పారు.