News May 2, 2024

HYD: క్రిశాంక్ అరెస్ట్ అక్రమం: తలసాని

image

ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి మన్నె క్రిశాంక్ అరెస్ట్ అక్రమమని, కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత ధోరణికి ఇది నిదర్శనమని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. HYD బోయిన్‌పల్లిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న తలసాని.. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితను గెలిపించాలని కోరారు. BRS మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Similar News

News September 24, 2024

విద్యాశాఖకు మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ: RSP

image

రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను BRS నేత RSP ‘X’ ద్వారా ప్రభుత్వం ముందు ఉంచారు. ‘ప్రభుత్వo DSC పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు5 వరకు ఆన్‌లైన్(CBT)లో నిర్వహించింది. అభ్యర్థులు వాయిదా వేయాలని వేడుకున్నా పట్టించుకోకుండా హడావుడిగా ఎగ్జామ్ నిర్వహించింది. ఇంకా రిజల్ట్స్ విడుదలచేయలేదు. అసలు విద్యాశాఖ మంత్రి ఎవరు. ఆయన ఏ ప్రపంచంలో సేదతీరుతున్నారు. విద్యాశాఖకు మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ’ అని అన్నారు.

News September 24, 2024

HYD: కేంద్రమంత్రిని కలిసిన స్పీకర్, ఎంపీలు, ఎమ్మెల్యే

image

కేంద్రమంత్రి నితీన్‌గడ్కరీని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు జాతీయ రహదారులపై గడ్కరీతో స్పీకర్ చర్చలు జరిపారు. స్పీకర్‌తో పాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తదితరులు ఉన్నారు.

News September 24, 2024

HYD: పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు!

image

BRS పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన పదిమంది ఎమ్మెల్యేలకు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ మార్పుపై 4 వారాల్లోగా వివరణతో కూడిన ఆపిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. పార్టీ ఫిరాయింపు చట్టం మేరకు వారిని డిస్‌క్వాలిఫై చేయాలని ఆయన కోరారు.