News April 5, 2025

HYD: గుండె, గ్యాస్ట్రో, న్యూరో ఆసుపత్రులుగా TIMS

image

HYDలో నిర్మాణం సాగుతున్న సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ TIMS ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. సనత్‌నగర్ కార్డియాక్ స్పెషాలిటీ, అల్వాల్ గ్యాస్ట్రో, ఎల్బీనగర్ న్యూరో స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చనున్నారు. HYDలో గాంధీ, ఉస్మానియా జనరల్ ఆసుపత్రులుగా ఉండగా, గుండె, గ్యాస్ట్రో, న్యూరో స్పెషాలిటీ వైద్యం అందుబాటులో లేకపోగా ఈ TIMSలను మార్చనున్నారు.

Similar News

News April 12, 2025

టీటీడీ కోటి విరాళం 

image

టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.1 కోటిని వైజాగ్‌కు చెందిన మైత్రి ఇన్ఫాస్ట్రక్చర్ & మైనింగ్ ప్రైవేట్ లిమిటడ్ ఛైర్మన్ శ్రీనివాస్ రావ్ అందజేశారు. ముందుగా తిరుమల క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఅర్ నాయుడుని కలిసి విరాళం చెక్‌ను అందజేశారు. అనంతరం దాతను ఛైర్మన్ అభినందించారు. 

News April 12, 2025

3 నెలల్లో 85వేల వీసాలు.. చైనా స్నేహహస్తం!

image

సరిహద్దు వివాదాలతో భారత్‌తో కయ్యానికి కాలుదువ్వే చైనా కొంతకాలంగా మెతక వైఖరి అవలంబిస్తోంది. ఇటీవల సరిహద్దుల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్న చైనా తాజాగా భారతీయులకు వీసాల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. గత 3 నెలల్లో 85 వేల వీసాలు ఇచ్చామని చైనీస్ ఎంబసీ తెలిపింది. ‘చైనాను సందర్శించేందుకు మరింత మంది ఇండియన్ ఫ్రెండ్స్‌కు స్వాగతం’ అని ట్వీట్ చేసింది.

News April 12, 2025

SRPT రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన SP

image

సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ నరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను, పోలీస్ స్టేషన్ నిర్వహణ, పరిసరాలు, ఫిర్యాదుల నిర్వహణ, రిసెప్షన్ మేనేజ్మెంట్ మొదలైన అంశాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఫిర్యాదులపై సత్వరం స్పందించి సేవలు అందించాలని చెప్పారు. SI బాలు నాయక్, సిబ్బంది ఉన్నారు.

error: Content is protected !!