News July 2, 2024

HYD: గ్రూప్-4 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ

image

HYD తెలంగాణ రాష్ట్ర రిక్రూట్మెంట్ కమిషన్ కార్యాలయంలో గ్రూప్-4 అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరిగింది. HYD, RR, MDCL, VKB సహా ఇతర జిల్లాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొంత మంది అభ్యర్థులు పూర్తి దరఖాస్తులు తీసుకురాకపోవడంతో, అధికారులు పలు సూచనలు చేసి, వారికి తగిన సమయం కేటాయించారు. 

Similar News

News September 23, 2024

HYD: గీతం యూనివర్సిటీ రూ.1 కోటి విరాళం

image

వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి గీతం యూనివర్సిటీ రూ.కోటి విరాళం అందజేశారు. గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఎంపీ శ్రీ భరత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచిన వారిని ముఖ్యమంత్రి అభినందించారు.

News September 23, 2024

HYD: అక్రమ నల్లా కనెక్షన్ గుర్తిస్తే కాల్ చేయండి: MD

image

అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. HYD నగరంలో ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగించినట్లు గుర్తిస్తే విజిలెన్స్ బృందానికి 9989998100, 9989992268 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని కోరారు.

News September 23, 2024

చేవెళ్ల: రూ.38 కోట్లు విడుదల: ఎంపీ

image

స్వదేశీ అభియాన్ పథకం కింద రూ.99 కోట్లతో వికారాబాద్ అనంతగిరి కొండలను అభివృద్ది చేస్తామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. దీనిలో మొదటి దశలో రూ.38 కోట్లు విడుదలయ్యాయని పేర్కొన్నారు. శంకర్పల్లి, మర్పల్లి రోడ్లు దెబ్బతిన్నాయని, రూ.400 కోట్లు నిధులు మంజూరు చేయాలని మంత్రి నితిన్ గడ్కరీని అడుగుతానని తెలియజేశారు.