News March 26, 2025
HYD: గ్రేట్.. చనిపోతూ ఏడుగురిని కాపాడాడు!

తాను చనిపోతూ ఏడుగురికి ప్రాణం పోశాడు ఓ యువకుడు. ఎల్బీనగర్‌లో నివాసం ఉండే శ్రీ అశ్లేశ్ గురునానక్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. మైగ్రేన్, ఫిట్స్‌తో మార్చి 21 అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సికింద్రాబాద్ కిమ్స్‌కు తరలించగా మార్చి 23న అతడి బ్రెయిన్ డెడ్ అయ్యింది. తల్లిదండ్రులు శివశంకర్, ప్రమీల రాణి కుమారుడి అవయవదానానికి ఒప్పుకున్నారు. దీంతో జీవన్‌దాన్ ద్వారా ఏడుగురి ప్రాణాలు కాపాడారు.
Similar News
News March 29, 2025
HYD: ఉరేసుకొని మెహందీ ఆర్టిస్ట్ మృతి

రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
News March 29, 2025
అంబర్ పేట్: యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

అంబర్ పేట పీఎస్‌లో న్యూస్‌లైన్ నిర్వాహకుడు, యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు ఓ మహిళ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద కేసు నమోదు అంబర్ పేట పోలీసులు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది.
News March 29, 2025
అంబర్ పేట్: యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

అంబర్ పేట పీఎస్‌లో న్యూస్‌లైన్ నిర్వాహకుడు, యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు ఓ మహిళ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69,79,352, 351(4) BNS సెక్షన్ల కింద కేసు నమోదు అంబర్ పేట పోలీసులు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపణ చేసింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపారు.