News February 22, 2025

HYD: చందానగర్‌లో దారుణ హత్య

image

చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. గోపినగర్‌కు చెందిన ఫక్రుద్దీన్,‌ నజీర్ స్నేహితులు. రాత్రి 8 గంటల సమయంలో మాట్లాడే పని ఉందని స్నేహితులు గోపిచెరువు వద్దకు నజీర్‌ను తీసుకెళ్లారు. అక్కడ గొడవ జరగింది. ఫక్రుద్దీన్ దాడిలో నజీర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 23, 2025

జిల్లాలో అప్పుడే.. 37.5℃ ఉష్ణోగ్రతలు

image

రంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం అత్యధికంగా మొగల్‌గిద్దలో 37.5℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు ప్రోద్దటూర్, కాసులాబాద్, చందానవల్లి, తొమ్మిదిరేకుల 37.4, చుక్కాపూర్‌ 37.3, షాబాద్‌ 37.2, రెడ్డి పల్లి, మొయినాబాద్‌ 37.1, కేతిరెడ్డిపల్లి 37, తుర్కయాంజాల్‌ 36.8, మంగల్‌పల్లి 36.7, కేశంపేట్, యాచారం 36.6, కొత్తూరు, మహేశ్వరం 36.5, తోర్రూర్, కొండూర్గ్‌లో 36.4℃గా నమోదైంది.

News February 23, 2025

ఆదివారం: HYDలో పతనమవుతున్న చికెన్ ధరలు

image

HYDలో చికెన్ ధరలు పతనం అవుతున్నాయి. KG మీద ఏకంగా రూ.18 నుంచి రూ.20 వరకు తగ్గించారు. శుక్రవారం KG స్కిన్ లెస్ రూ 168, విత్‌స్కిన్ KG రూ.148గా ఉండగా.. నేడు మోరోసారి భారీగా పడిపోయాయి. KG స్కిన్‌లెస్ రూ.152, విత్ స్కిన్ రూ. 133 చొప్పున అమ్మకాలు జరుపుతున్నారు. హోల్‌సేల్ దుకాణాల్లో ఇంకా తగ్గించి విక్రయిస్తున్నారు. రిటైల్ షాపుల్లో మాత్రం ధరలు యథావిధిగా ఉంటున్నాయి. మీ ఏరియాలో KG చికెన్ ధర ఎంత?

News February 23, 2025

HYD: 2030 నాటికి 1.27 కోట్ల జనాభా..!

image

జీహెచ్ఎంసీ పరిధిలో జనాభా వేగంగా పెరుగుతోంది. వివిధ సర్వేల ప్రకారం, ప్రస్తుతం 1.08 కోట్లు ఉన్న జనాభా 2030 నాటికి 1.27 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ పెరుగుదల దృష్ట్యా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ట్రాన్స్‌పోర్ట్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. HYD నగర విస్తరణతో పాటు సమతుల్య ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడ్డారు.

error: Content is protected !!