News April 6, 2025
HYD: చికెన్ దుకాణాలు ఖాళీ

మాంసం ప్రియులకు సండే పండగే. ఉదయం చికెన్, మటన్ షాపుల వద్ద క్యూలైన్లు, కిటకిటలాడే గిరాకీ షరామామూలే. కానీ, ఈ ఆదివారం శ్రీ రామ నవమి కావడంతో దృశ్యం పూర్తిగా మారిపోయింది. ప్రతాపసింగారం సహా HYDలోని అనేక మాంసం దుకాణాలు వెలవెలబోయాయి. ఎప్పుడూ జనసంద్రంగా మారే మార్కెట్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ఇదే సీన్ గత వారం ఉగాది రోజూ కనిపించింది. పండుగల దెబ్బకు అమ్మకాలు పూర్తిగా తగ్గాయని వ్యాపారస్థులు చెబుతున్నారు.
Similar News
News April 11, 2025
26/11 అటాక్‌లో హైదరాబాద్ ప్రస్తావన

ముంబై ఉగ్రదాడి నిందితుడు రాణాను ఎట్టకేలకు ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో HYDకు చెందిన ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కాగా.. అజ్మల్ కసబ్ దగ్గర నాగోల్ చిరునామా, అరుణోదయ కాలేజీ పేరు ఉన్న బోగస్ ఐడీలు బయటపడ్డాయి. ఆ కార్డుల్లో నగర చిరునామాలు ఉండటంతో ముంబై పోలీసులు HYD చేరుకుని దర్యాప్తు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ‘HYD’ అనే ఉగ్రవాదుల వ్యాఖ్యలు కలకలం రేపాయి. నిపుణుల భాషా విశ్లేషణతో వారు పాక్ అని తేలిపోయింది.
News April 11, 2025
శంషాబాద్ విమానాశ్రయానికి 56వ స్థానం

ప్రపంచంలోని టాప్ 100 విమానాశ్రయాల జాబితాలో మన దేశంలోని 4 విమానాశ్రయాలకు స్థానం దక్కింది. అంతర్జాతీయ ఎయిర్ ట్రావెల్ రేటింగ్ సంస్థ స్కైట్రాక్స్ ప్రకటించిన ర్యాంకుల ప్రకారం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 56వ స్థానంలో నిలవగా.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం 32వ స్థానంలో నిలిచింది.
News April 11, 2025
HYD: జిమ్ ట్రైనర్ హత్య.. నిందితుల రిమాండ్

బోడుప్పల్‌లో జిమ్ ట్రైనర్ మర్డర్ కారణాన్ని పోలీసులు వెల్లడించారు. ఇందిరానగర్‌కు చెందిన చంటి భార్యతో జిమ్ ట్రెయినర్ సాయికిషోర్ చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో ఆమెను ప్రశ్నించాడు. దీంతో పుట్టింటికి వెళ్లింది. కక్షగట్టిన చంటి మర్డర్‌కు ప్లాన్ చేసి స్నేహితులు ధ్రువకుమార్‌సింగ్, శ్రీకాంత్, సాయికిరణ్‌తో కలిసి జిమ్‌లోనే అతడిపై డంబెల్‌తో దాడిచేయగా మృతిచెందాడు. రాత్రి నిందితులను రిమాండ్ చేశారు.