News April 8, 2024
HYD: చివరి దశలో ORR ట్రంపెట్ పనులు
ఐటీ కారిడార్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే క్రమంలో గత BRS ప్రభుత్వం కోకాపేటలో సుమారు 534 ఎకరాల విస్తీర్ణంలో కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌ను HYD మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టింది. ఇందులో భాగంగానే కోకాపేట నియో పోలీస్ లేఅవుట్‌ను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న ORR ట్రంపెట్ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. దీనిపై వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 3, 2025
HYD: భారత జాగృతి ఆధ్వర్యంలో నేడు బీసీ సంఘాల సభ
భారత జాగృతి ఆధ్వర్యంలో నేడు HYDలో బీసీ సంఘాల సభ జరగనుంది. ఉదయం 11 నుంచి సా.4 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద BRS MLC కవిత సభను నిర్వహించనున్నారు. సభకు నిన్ననే పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సభ నిర్వహించనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సభలో ప్రధానంగా డిమాండ్ చేయనున్నారు.
News January 3, 2025
HYD: నిలోఫర్ ఆసుపత్రిలో మరో వెయ్యి పడకలు: రవికుమార్
HYD నిలోఫర్ ఆసుపత్రిలో మరో వెయ్యి పడకల పెంపునకు చర్యలు చేపడుతున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రవికుమార్ చెప్పారు. నీలోఫర్ ఆసుపత్రికి తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర దేశాల నుంచి రోగులు వస్తున్నారని అందుకు తగ్గట్టుగా పడకలు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు 1,300 బెడ్లు ఉండగా కొత్త మరో వెయ్యి పడకలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.
News January 3, 2025
అంకితభావంతో పనిచేయాలి: GHMC కమిషనర్
నగర అభివృద్ధికి ఉద్యోగులకు అంకితభావంతో పనిచేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని GHMC కమిషనర్ ఇలంబర్తి ఉద్యోగులకు సూచించారు. ఈ మేరకు నూతన సంవత్సరం సందర్భంగా ఖైరతాబాద్‌లోని GHMC ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ను జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల హెచ్‌వోడీలు, కార్పొరేటర్లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని సంకల్పంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.