News December 25, 2024
HYD: చీకటి ప్రాంతాలే అడ్డాగా..!
HYD శివారు చీకటి ప్రాంతాలను చైన్ స్నాచింగ్, గంజాయి, అసాంఘిక కార్యక్రమాలకు ముఠాలు అడ్డగా మార్చుకుంటున్నట్లు వివిధ కేసుల్లో తెలిసింది. శామీర్‌పేట, పెద్ద అంబర్ పేట, ఔటర్ రింగ్ రోడ్డు సమీప ప్రాంతాల్లో అన్నోజిగూడ, యమ్నంపేట, ఘట్కేసర్, మాధవరెడ్డి బ్రిడ్జి, అవుషాపూర్, తోండుపల్లి జంక్షన్, మల్లంపేట నుంచి దుండిగల్ వైపు ప్రాంతాల్లో ముఠాలు తిష్ట వేస్తున్నాయి.
Similar News
News December 26, 2024
మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న ఒడిసి నృత్యాలు
మాదాపూర్ శిల్పారామంలో జరుగుతున్న ఆలిండియా క్రాఫ్ట్స్ మేళాలో భాగంగా సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూర్ నిర్వహణలో రూప్ చంద్ బృందం పురూలియా చౌ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. అదే విధంగా ఒడిసి నృత్య ప్రదర్శనలో భాగంగా సస్మితా మిశ్ర శిష్య బృందం హంస ధ్వని పల్లవి, శంకరాభరణం పల్లవి, బసంత్ పల్లవి, స్థాయీ, మోక్ష మొదలైన అంశాలను.. శుభశ్రీ, అంకిత, శ్రద్హ, జ్యోతిక, రిధి, అన్వితలు ప్రదర్శించి అలరించారు.
News December 26, 2024
ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్యాలు
ఉప్పల్ మినీ శిల్పారామంలో కూచిపూడి నాట్య గురువు సాత్విక శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. మహాగణపతిమ్, లింగాష్టకం, బాలకనకయ్య, చిన్ని శిశివు, అన్నపూర్ణ, అల్లోనేరేళ్లో, పేరిణి కౌత్వం, వారాహి, అష్టలక్ష్మి, గరుడ గమన మొదలైన అంశాలను.. స్ఫూర్తి, నిత్యశ్రీ, గగనశ్రీ, సాన్విక, యోషిక, జూషిత, సహస్ర, ప్రణవి, మనస్వి తదితరులు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.
News December 26, 2024
HYD: వారిని కించపరచొద్దు.. BSNLకి మాజీ ఎంపీ వినోద్ లేఖ
మొబైల్ ఫోన్ సందేశం పేరిట జడ్జిలు, పోలీస్ అధికారులను కించపరచొద్దని BSNL HYD సీజీఎంకు BRS మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. సైబర్ క్రైమ్ అలెర్ట్ కోసం చేస్తున్న ప్రకటనల్లో ‘మీకు జడ్జిలు, పోలీసులు వీడియో కాల్స్ చేస్తూ సైబర్ క్రైమ్‌లకు పాల్పడవచ్చు’అని ఫోన్ కాల్‌కు ముందు వస్తోందన్నారు. ఇందులో తప్పు దొర్లుతోందని, ‘జడ్జిలు, పోలీసుల పేరిట’ అని ఇవ్వాలని కోరారు.