News March 25, 2025
HYD: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 7 నుంచి 10 వరకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ అదనపు కమిషనర్ యాదగిరిరావు తెలిపారు. స్పోర్ట్స్ మీట్‌లో కార్పొరేటర్లు, ఉద్యోగులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. మహిళలు, పురుషుల కేటగిరీల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రీడలు విక్టరీ ప్లే గ్రౌండ్‌తో పాటు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయని తెలిపారు.
Similar News
News March 29, 2025
HYD: నగరంలో పెరిగిన ట్యాంకర్ల డిమాండ్

HYD నగరంలో నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉగాది, రంజాన్ పండుగలతో నీటి వినియోగం ఎక్కువైంది. ఈ క్రమంలో జలమండలి ట్యాంకర్లకు బాగా డిమాండ్ పెరిగింది. రోజుకు సగటున 9 వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నాయని, వాటిని 24 గంటలలోపు సరఫరా పంపుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News March 29, 2025
అంబర్ పేట్: యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

అంబర్ పేట పీఎస్‌లో యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద అంబర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది.
News March 29, 2025
రంగారెడ్డిలో అత్యధికం ఉష్టోగ్రత ఇక్కడే..!

రంగారెడ్డి జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. యాచారం, మంగల్‌పల్లిలో 41.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. చందనవెల్లి 41.3, రెడ్డిపల్లె, చుక్కాపూర్ 41.2, ప్రొద్దుటూరు 41.1, నల్లవెల్లి, కేశంపేట 41, మీర్‌ఖాన్‌పేట, కొత్తూర్ 40.9, మామిడిపల్లె, పెదఅంబర్‌పేట్, తొమ్మిదిరేకుల 40.8, మొగల్గిద్ద, కాసులాబాద్ 40.7, కేతిరెడ్డిపల్లి 40.6, మొయినాబాద్ 40.5, తట్టిఅన్నారం, షాబాద్ 40.4, కోంగరకలాన్లో 40.3℃ ఉష్ణోగ్రత నమోదైంది.