News March 29, 2025
HYD: జీహెచ్ఎంసీ కొత్త యాప్.. ఆన్ లైన్ చలాన్ !

హైదరాబాద్ నగర పరిశుభ్రతను మెరుగు పరిచేందుకు జీహెచ్ఎంసీ త్వరలో కొత్త యాప్‌ను ప్రారంభించనుంది. ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ రూపొందించిన ఈ యాప్ ద్వారా చెత్త నిర్వాహణ మరింత సమర్థంగా మారనుంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేయడాన్ని నివారించేందుకు ఈ-చలాన్లు జారీ చేస్తారు. చలాన్ల చెల్లింపులు యూపీఐ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. దీంతో లావాదేవీలు పారదర్శకంగా ఉంటాయి.
Similar News
News April 2, 2025
ఉట్నూర్: అస్వస్థతతో ఉపాధి కూలీ మృతి

అస్వస్థతకు గురై ఉపాధి కూలీ మృతిచెందాడు. గ్రామస్థుల వివరాలు.. ఉట్నూర్ (M) అందోలికి చెందిన పారేకర్(34) 3 వారాలుగా ఉపాధి పనులకు వెళ్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం వరకు పని చేసి ఇంటికి చేరుకుని పడుకున్నాడు. కొద్దిసేపటికి అతడికి వాంతులు, విరోచనాలు, ఛాతిలో నొప్పి రావడంతో ఇంద్రవెల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ADBకి తరలించే క్రమంలో మృతిచెందాడు. ఎండ తీవ్రతతో మరణించినట్లు అనుమానిస్తున్నారు.
News April 2, 2025
WAQF BILL: ఆమోదం పొందడం లాంఛనమే?

కేంద్రం నేడు లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. బిల్లు సభ ఆమోదం పొందడం లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. ప్రస్తుతమున్న 542 మందికి గాను ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలం ఉంది. ఆమోదం పొందడానికి 272 ఓట్లు అవసరం. రాజ్యసభలో 118 ఓట్లు అవసరం కాగా 125 సంఖ్యాబలం ఉంది. మిత్రపక్షాల మద్దతుపై BJP విశ్వాసంతో ఉంది. కాగా INC, SP, TMC, DMK, AAP, శివసేన(UBT), NCP(SP) తదితర విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
News April 2, 2025
అల్లూరి: పాలీసెట్ పరీక్షకు ఉచిత శిక్షణ

రాష్ట్ర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశ పాలీసెట్-2025 పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అల్లూరి జిల్లా పాడేరు జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.సుజాత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తమ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 2 నుంచి పాలీసెట్ కోచింగ్‌కు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.