News June 14, 2024

HYD: ట్రైనీ ఐఏఎస్‌లకు సజ్జనార్ అవగాహన

image

తెలంగాణ కేడర్‌కి చెందిన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు శుక్రవారం HYDలోని బస్‌భవన్‌ను సందర్శించారు. టీజీఎస్‌ఆర్టీసీ అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను వారు అధ్యయనం చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఆర్టీసీ పనితీరు, ఉద్యోగుల సంక్షేమం, మహాలక్ష్మీ పథకం అమలుపై వివరాలు తెలిపారు.

Similar News

News October 5, 2024

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే 45 శాతం ఆదాయం: చంద్రశేఖర్

image

రాష్ట్ర రవాణా శాఖ ఆదాయంలో 45 శాతం ఆదాయం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే వచ్చిందని జిల్లా ఉప రవాణా కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ పేర్కొన్నారు. మణికొండలోని రవాణా శాఖ కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మొత్తం 33 జిల్లాల నుంచి రూ.3,195 కోట్ల ఆదాయం వస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే 45 శాతం ఆదాయం రావడం జరిగిందన్నారు.

News October 5, 2024

శంషాబాద్‌: తండ్రిని హత్య చేసిన కొడుకు

image

రంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. శంషాబాద్‌లో తండ్రిని కొడుకు హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రారెడ్డి కాలనీకి చెందిన రాములు తరచూ మద్యం తాగి గొడవ పడేవాడు. ఈ క్రమంలో రాములు తన కూతురు ఇంటి వద్ద గొడవ పడటంతో కోపోద్రిక్తుడైన అతడి కొడుకు శివకుమార్ గొడ్డలితో నరికి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News October 5, 2024

శేరిలింగంపల్లి: దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

image

దసరా సందర్భంగా HCU ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు హెచ్‌సీయూ డిపో మేనేజర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక బస్సులను ఈ నెల 12వ వరకు నడుపుతామన్నారు. లింగంపల్లి నుంచి MGBS వరకు, గచ్చిబౌలి నుంచి మహబూబ్ నగర్ వైపు, లింగంపల్లి నుంచి జహీరాబాద్ వైపు బస్సులు ఉంటాయని వివరించారు. వివరాలకు ఫోన్ నంబర్ 7382814235ను సంప్రదించాలని సూచించారు.