News February 11, 2025
HYD: డ్రైవింగ్‌లో యువత బాధ్యతగా వ్యవహరించాలి

‘తల్లిదండ్రుల్లారా, మీ పిల్లలకు వాహనాలు కొనిచ్చి మురిసిపోవడం కాదు. రోడ్లపై వాళ్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారా? లేదా? తెలుసుకోండి’ అని టీజీఆర్టీసీ ఛైర్మన్ సజ్జనార్ తెలిపారు. యథేచ్ఛగా త్రిపుల్ రైడింగ్ చేస్తూ తప్పించుకునేందుకు రకరకాల విన్యాసాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగితే ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించాలన్నారు. డ్రైవింగ్ విషయంలో యువత బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
Similar News
News December 14, 2025
నాగర్‌కర్నూల్‌లో 53.2% పోలింగ్

నాగర్‌కర్నూల్ జిల్లాలో జరుగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 53.2 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. మండలాల వారీగా అత్యధికంగా నాగర్‌కర్నూల్‌లో 57.1 శాతం, అత్యల్పంగా పెంట్లవెల్లిలో 49.8 శాతం పోలింగ్ నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
News December 14, 2025
బ్రాహ్మణికి ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్’ అవార్డు

AP: హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ప్రతిష్ఠాత్మక ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డును అందుకున్నారు. ప్రముఖ వాణిజ్య మ్యాగజైన్ ‘బిజినెస్ టుడే’ ముంబైలో నిన్న ఈ అవార్డును ఆమెకు ప్రదానం చేసింది. నాయకత్వం అంటే శాశ్వతంగా నిలిచే సంస్థలను నిర్మించడం, ప్రజలను శక్తిమంతం చేయడమని ఆమె అభిప్రాయపడ్డారు. అవార్డుల ద్వారా మహిళలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.
News December 14, 2025
ప్రకాశం: గ్యాస్‌పై ఎక్కువ వసూలు చేస్తే.. నోటీసులే.!

సిలిండర్ డెలివరీకి అధికంగా పైసలు వసూలు చేస్తే IVRSకు పట్టుబడే పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఉంది. ప్రభుత్వం తమ సేవల గురించి ప్రతి వినియోగదారుడికి ఐవీఆర్ఎస్ కాల్ చేస్తుంది. ఈ విధంగానే గ్యాస్ వినియోగదారులకు కూడా కాల్స్ ద్వారా డెలివరీ సమయంలో ఇబ్బందులపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. వినియోగదారులు నేరుగా పలు గ్యాస్ ఏజెన్సీలపై ఫిర్యాదులు చేయవచ్చు. ఈ మధ్యకాలంలో దీనిపై ఆ ఏజెన్సీలకు అధికారులు నోటీసులిచ్చారు.


