News January 3, 2025
HYD: తెలంగాణ భవన్‌లో సావిత్రిబాయి ఫూలే జయంతి
HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో నేడు సావిత్రిబాయి ఫూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా MLC మధుసూదనా చారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విద్యను బలోపేతం చేసేందుకు ఆమె చేసిన త్యాగాలను గుర్తుచేశారు. BRS నాయకులు పాల్గొన్నారు.
Similar News
News January 7, 2025
HYD: ఒంటరి పోరాటంతో.. బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ!
HYD వేదికగా నిర్మల్ వాసి నరిమెట్ల వంశీ, TSPLRB-2018 పోలీస్ కానిస్టేబుల్ బ్యాక్‌లాగ్ ఉద్యోగాల కోసం పోలీస్ బోర్డుపై చేసిన న్యాయ పోరాటం ఫలించింది. నోటిఫికేషన్లో 1370 పోస్టుల్లో ఎవరు చేరక పోవటంతో, ఆ ఖాళీలను తదుపరి లిస్ట్ అభ్యర్థులకు ఇవ్వాలని హైకోర్టు, సుప్రీంకోర్టు కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు మెట్లెక్కిన దాదాపు 100 మందికి 2024లో ఉద్యోగాలు వచ్చాయన్నారు. తన 6 ఏళ్ల ఒంటరి పోరాటాన్ని అభినందిస్తున్నారు.
News January 7, 2025
HYDలో భారీగా పెరిగిన ఓటర్లు
రాష్ట్రవ్యాప్తంగా తుది ఓటరు జాబితా విడుదలైంది. రంగారెడ్డి, HYD, మేడ్చల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి 1.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం అత్యధికంగా 7.65 లక్షల మంది ఓటర్లతో మొదటి స్థానంలో ఉండగా.. 2.32 లక్షలమంది ఓటర్లతో చివరి స్థానంలో చార్మినార్ ఉంది. కేవలం ఒక్క ఏడాదిలోనే 2 లక్షల మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు.
News January 7, 2025
HYD: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20ఏళ్ల జైలు
మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు ఇచ్చింది. 2018లో వనస్థలిపురం PS పరిధిలో తాపీ మేస్త్రిగా పనిచేసే కార్తిక్(22) ఓ బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు వెల్లడించారు.