News May 25, 2024

HYD: దొంగ మెసేజ్, లింకులను నమ్మకండి జాగ్రత్త!

image

HYD,RR,MDCL,VKB జిల్లాల విద్యుత్ వినియోగదారులకు TGSPDCL పలు సూచనలు చేసింది. గుర్తుతెలియని వాట్సప్ నెంబర్ల నుంచి, ఈమెయిల్ తదితర వెబ్ సైట్ల నుంచి కరెంటు బిల్లులు చెల్లించండి, నూతన లింకుల కోసం క్లిక్ చేయండి అని వచ్చే దొంగ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. లింకు నొక్కిన తర్వాత CVV,OTP లాంటివి అడుగుతే ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దన్నారు. విద్యుత్ అధికారుల నుంచి అలాంటి కాల్స్ ఎప్పుడు రావన్నారు.

Similar News

News September 30, 2024

HYD: చెరువుల హద్దులపై HMDAకు హైకోర్టు ఆర్డర్

image

HMDAలోని 3,532 చెరువులకుగానూ.. 230 చెరువులకు మాత్రమే బఫర్ జోన్, FTL నిర్ధారించారు. 2,525 చెరువులకు హద్దులను ఖరారు చేసింది. కాగా.. మరో 3 నెలల్లో 1,000 చెరువులకు హద్దులను నిర్ధారించాలని హైకోర్టు HMDAను ఆదేశించింది. హైకోర్టు నోటీసుల నేపథ్యంలో HMDA చర్యలకు ఉపక్రమించింది. నవంబర్‌లోగా పని పూర్తి చేయాల్సి ఉంది.

News September 30, 2024

HYD: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ

RR 3231 205 1:15

HYD 2487 285 1:09

MDCL 646 41 1:15

VKB 4630 169 1:27

News September 30, 2024

HYD: వర్సిటీగా మారనున్న SBTET సాంకేతిక మండలి!

image

రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం VKB జిల్లా కోస్గి పాలిటెక్నిక్ కాలేజీని ఇంజినీరింగ్ కాలేజీగా మార్చారు. తాజా మంత్రివర్గ సమావేశంలో మరో 9 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కూడా మార్చాలని నిర్ణయించింది. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రస్తుతం SBTET సాంకేతిక మండలి పర్యవేక్షిస్తుంది. ఈ బోర్డుకు ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలేషన్ ఇవ్వడానికి వీలు ఉండదని భవిష్యత్తులో వర్సిటీగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తుంది.