News April 23, 2025
HYD: నెహ్రూ జూలాజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్

నెహ్రూ జూలాజికల్ పార్కులో హైదరాబాద్ జూ జూస్టాస్టిక్ సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు క్యూరేటర్ తెలిపారు. మే మొదటి వారంలో ప్రారంభమై జూన్ వరకు ఈ సమ్మర్ క్యాంపు ఉంటుందన్నారు. 5 నుంచి పదవ తరగతి విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. ఒక్కరికి రూ.1000 ఫీజు ఉంటుందని, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. క్యాంప్‌లో జూ టూర్, సరీసృపాల అవగాహన సెషన్, నైట్ హౌస్ సందర్శన, ఇతర కార్యక్రమాలు ఉంటాయన్నారు.
Similar News
News December 15, 2025
గ్రేటర్ పాలనలో ‘రాజకీయమే’ ప్రథమం!

GHMC పరిధిలో కలిసిన 27 అర్బన్ లోకల్ బాడీస్ (ULBs)కు ఇది నిజంగా చేదువార్త! కీలకమైన సీవరేజ్ మాస్టర్ ప్లాన్ అంశాన్ని అధికారులు పూర్తిగా పక్కన పెట్టేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులంతా కేవలం వార్డుల డీలిమిటేషన్ పనిలోనే తలమునకలయ్యారు. అన్నీ పూర్తయ్యాక HMWSSBతో మాట్లాడి ఆతర్వాత మురుగు ప్లాన్‌ను రూపొందిస్తామంటున్నారు. ప్రజారోగ్యం కంటే ఎన్నికల లెక్కలకే ప్రాధాన్యత ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News December 15, 2025
HYD: అబార్షన్ చేసుకోమని ఒత్తిడి.. బాలిక సూసైడ్ అటెంప్ట్

HYDలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగింది. మాయమాటలు చెప్పి బాలికను యువకుడు గర్భవతిని చేశాడు. అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేయడంతో బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో మధురానగర్ పోలీసులు జీరో FIR నమోదు అయ్యింది. అనతంరం జగద్గిరిగుట్ట PSకు ఈ కేసు బదిలీ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 15, 2025
HYD: నిజాం నీడలో నలిగిన తెలంగాణ: చిల్లర దేవుళ్లు

నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ గ్రామీణం ఎదుర్కొన్న అణచివేతలను దాశరథి రంగాచార్యులు <<18569096>>చిల్లర దేవుళ్లు<<>>లో హృదయవిదారకంగా చిత్రించారు. దొరలు, కర్ణం వ్యవస్థ, భూస్వాములు, వెట్టిచాకిరీ, మతమార్పిడులు, స్త్రీల వేదనల జీవితం కళ్లముందు కదులుతున్నట్లే ఇందులో వర్ణించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు నాటి దుర్భర సామాజిక పరిస్థితులను చరిత్రగా అక్షరీకరించారు. ఈ నవల చదువుతున్నంత సేపు నాటి సమాజంలో ఉన్నట్లే ఉంటుంది.


