News April 9, 2024

HYD: నేడు సాలార్‌జంగ్ మ్యూజియానికి సెలవు

image

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు సాలార్‌జంగ్ మ్యూజియం మూసి ఉంటుందని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈరోజు పండుగ సెలవు నేపథ్యంలో సాలార్‌జంగ్ మ్యూజియంను సందర్శించడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.

Similar News

News December 29, 2024

నిఘా నీడలో హైదరాబాద్!

image

మహా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌, ఉప్పల్‌, రాజేంద్రనగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి, ఫిల్మ్‌నగర్‌, సరూర్‌నగర్‌ పబ్‌లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. వేడుకల పేరుతో డ్రగ్స్‌ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని యజమానులను ఆదేశించారు.

News December 28, 2024

HYD: అవగాహనతోనే మదకద్రవ్యాల నిర్మూలన: సందీప్ శాండిల్య

image

అవగాహనతో మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని టీజీఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. శనివారం ‘డ్రగ్-ఫ్రీ వెల్‌నెస్’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎడిస్టీస్ ఫౌండేషన్, క్రియేట్ ఎడ్యుటెక్‌లతో సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మార్గదర్శకాలతో ఆన్‌లైన్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు.

News December 28, 2024

CA Resluts: ఆల్ ఇండియాలో హైదరాబాద్ నం.1

image

CA ఫలితాల్లో‌ హైదరాబాద్‌ యువకుడు సత్తాచాటాడు. నగరానికి చెందిన హెరంబ్ మహేశ్వరి ఆల్ ఇండియాలో టాప్(నంబర్ 1) ర్యాంక్ సాధించారు. ఫైనల్ ఎగ్జామినేషన్‌లో 600 మార్కులకు 84.67 శాతంతో 508 మార్కులు సాధించారు. తిరుపతి వాసి రిషబ్ కూడా 508 మార్కులతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచారు. అహ్మదాబాద్ యువతి రియా 3, కోల్‌కతా వాసి కింజల్ అజ్మేరా 4వ ర్యాంక్‌ సాధించారు.