News February 13, 2025

HYD: పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలి

image

తరచుగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోందని ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ డా.గోపాలకృష్ణ అన్నారు. బాచుపల్లిలో ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. తమ అభిరుచులను పిల్లలమీద రుద్దకుండా వారికి ఇష్టమైన సబ్జెక్టు ఎంచుకునే అవకాశం ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని చెప్పారు.

Similar News

News February 13, 2025

వల్లభనేని వంశీ అరెస్ట్.. LATEST UPDATES

image

* కృష్ణలంక పీఎస్‌లో వల్లభనేని వంశీ స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న పోలీసులు* కాసేపట్లో వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కు తరలించనున్న పోలీసులు* వైద్య పరీక్షల తర్వాత ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపర్చే అవకాశం* కృష్ణలంక పీఎస్ దగ్గరకు వచ్చిన వంశీ భార్య* వల్లభనేని వంశీని కలిసేందుకు అనుమతి ఇవ్వని పోలీసులు* విశాఖ నుంచి పటమట పీఎస్‌కు సత్యవర్థన్ను తీసుకొచ్చిన పోలీసులు

News February 13, 2025

చీమకుర్తి: ఫైరింగ్ సాధన ప్రక్రియలో జిల్లా ఎస్పీ

image

ఫైరింగ్ సాధన ప్రక్రియలో భాగంగా చీమకుర్తి నందు గల జిల్లా ఫైరింగ్ రేంజ్‌లో పోలీసు అధికారులకు నిర్వహించిన వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్‌ను గురువారం జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్ సందర్శించి అక్కడ చేస్తున్న ఫైరింగ్ ప్రక్రియ గురించి అధికారులకు పలు సూచనలు తెలిపారు. జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి అధికారులలో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపారు.

News February 13, 2025

చేపలకు మేతగా బర్డ్ ఫ్లూ కోళ్లు!

image

AP: తూర్పు గోదావరిలో మరో ఘటన ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలోని చెరువుల్లో చేపలకు ఆహారంగా ఇస్తున్నారు. దీంతో చేపలు తినాలా? వద్దా? అని జనాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

error: Content is protected !!