News February 24, 2025
HYD: పిల్లలపై పెరుగుతున్న అఘాయిత్యాలు..!

గ్రేటర్ HYD పరిధిలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. POCSO చట్టం కింద నమోదైన కేసుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. 2022- 426, 2023- 559, 2024- 713 కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదలపై పోలీసులు, సామాజిక సంస్థలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో జరుగుతున్న క్రైమ్స్ గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.
Similar News
News February 24, 2025
సిరిసిల్ల: వ్యక్తిపై కేసు నమోదు: ఎస్పీ

మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. వేములవాడ దేవాలయానికి సంబంధించి సామాజిక మాధ్యమాలలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేసిన నూనె ముంతల రవీందర్ గౌడ్ (43) పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
News February 24, 2025
శ్రీకాళహస్తీశ్వరునికి పట్టువస్త్రాల సమర్పించనున్న మంత్రి ఆనం

శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి ప్రభుత్వం తరుఫున మంత్రి ఆనం పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొదటి నుంచి సీఎం చంద్రబాబు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ప్రచారం జరిగినా చివరికి ఆనం ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి 25వతేది(మంగళవారం) స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించున్నారు.
News February 24, 2025
రెబ్బెన: పుష్పవతి కావడం లేదని యువతి SUICIDE

పుష్పవతి కావడం లేదని మనస్తాపానికి గురై ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బెన మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(22) పుష్పవతి కావడం లేదని మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఇంట్లో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.