News April 13, 2024
HYD: పెరగనున్న సిటీ బస్సులు!
గ్రేటర్ HYDలో బస్సుల సంఖ్య పెరుగుతోంది. 2,850 బస్సులతో ప్రధాన రూట్లకే పరిమితమైన RTC ఇప్పుడు పూర్వవైభవాన్ని చాటేందుకు సిద్ధమౌతోంది. గతంలో 3,850 బస్సులు HYD జోన్లో ఉండేవి. 2019లో అప్పటి ప్రభుత్వం ఒకేసారి 1000 బస్సులను తగ్గించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది.దీంతో జిల్లాల్లో తిరుగుతున్న డీలక్స్ బస్సులను నగరానికి తెచ్చి సిటీ బస్సులుగా మార్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి.
Similar News
News November 25, 2024
HYD: 3.5 లక్షల కుటుంబాలు ఉచిత తాగునీటికి దూరం
GHMC పరిధిలో మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఉచిత తాగునీరు పథకం ఇంకా అర్హులకు పూర్తిగా అందడం లేదు. అర్హులైన ప్రతి కుటుంబానికి నెలకు 20వేల లీటర్ల తాగునీటిని జలమండలి సరఫరా చేస్తోంది. నగరంలో 9,73,873 అర్హులైన కుటుంబాలు ఉండగా ఇప్పటివరకు 6,14,497 కుటుంబాలు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నాయి. ఇంకా 3,59,376 కుటుంబాలకు ఉచిత తాగునీరు అందటం లేదు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
News November 25, 2024
HYD: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వారే అధికం.!
హైదరాబాద్లో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 21 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్నవారే 70 శాతానికి పైగా ఉండడం గమనార్హం. వీరిలో బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ సైతం ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 51-150 మిల్లీగ్రాములు ఆల్కహాల్ ఉన్నట్లుగా తేలింది. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపోద్దని, ఒకవేళ నడిపితే కటకటాల్లోకి వెళ్తారని పోలీసులు హెచ్చరించారు.
News November 25, 2024
గ్రేటర్ పరిధిలో మిగిలింది 25 % కుటుంబాలే..
గ్రేటర్ HYDలో ఎన్యుమరేటర్లు సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేశారు. ఇప్పటికే దాదాపు 75% సర్వే పూర్తయింది. 18,26,524 కుటుంబాలకు సంబంధించి వివరాలు సేకరించారు. వీలైనంత త్వరగా మిగిలిన 25% ఇళ్లల్లో సర్వే పూర్తి చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. సర్వేలో ఎలాంటి తప్పులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.