News April 7, 2025
HYD: పేకాట కేసులో ఓ MLA సన్నిహితుడు..?

మేడ్చల్ PS పరిధిలో గత శనివారం అర్ధరాత్రి SOT 14 మంది బృందం పేకాట ముఠా గుట్టురట్టు చేసిన విషయం తెలిసిందే. మేడ్చల్ పరిధి పూడూరులోని ఓ ఫామ్ హౌస్‌లో దాడులు నిర్వహించగా ఇందులో 18 మంది పేకాట ఆడుతుండగా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4 లక్షలకు పైగా నగదు,16 ఫోన్లు,12 కారులను సీజ్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఓ పార్టీ ఎమ్మెల్యే సన్నిహితుడు ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 17, 2025
ఎడపల్లి: బ్రాహ్మణపల్లిలో వివాహిత ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఎర్రోళ్ల అనిత(35) సూసైడ్ చేసుకుంది. ఆమె బంధువులు కొందరు అవమానపరిచారని మనస్థాపం చెంది ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.
News April 17, 2025
విదేశీ విద్యపై విద్యార్థులకు తగ్గుతున్న ఆసక్తి!

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఐదేళ్లలో తొలిసారి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024లో అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలకు వెళ్లే స్టూడెంట్స్ వీసాల్లో మొత్తం 25% తగ్గుదల కనిపించింది. అమెరికాకు వెళ్లేవారిలో 34%, బ్రిటన్‌కు 26%, కెనడాకు 32% మంది విద్యార్థులు తగ్గుముఖం పట్టారు. ఆయా దేశాల్లో నిబంధనలు కఠినతరం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
News April 17, 2025
అనకాపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

అనకాపల్లి కొత్తూరు జంక్షన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఎన్జీవోస్ కాలనీ నుంచి ద్విచక్ర వాహనంపై పరికి ప్రసాద్ (60) అతని భార్య వెళుతుండగా ఉమ్మలాడ నుంచి కసింకోట వస్తున్న మరో ద్విచక్ర వాహనం వెనుక నుంచి ఢీకొంది. ప్రసాద్ దంపతులతో పాటు మరో వాహనదారుడు గాయపడ్డారు. స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రసాద్ మృతి చెందాడు.