News October 21, 2024
HYD: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి: CP
పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. అంబర్‌పేట సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ పోలీసు అమరవీరుల స్మారక స్థూపానికి, పోలీసు అమరవీరుల చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు.
Similar News
News November 27, 2024
HYD: ఎన్యుమరేటర్లకు సహకరించాలి: వేం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కులగణన సర్వే అధికారులు, ఎన్యుమరేటర్లు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయన సర్వేలో కుటుంబ వివరాలు తెలిపారు. అధికారులకు ప్రతి కుటుంబం సహకరించాలని తెలిపారు. ఈ సర్వే ప్రతి కుటుంబ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాలకు ప్రణాళిక వేయటానికి ఉపయోగపడుతుందని వేం నరేందర్ రెడ్డి అన్నారు.
News November 27, 2024
HYD: ఫిబ్రవరిలో 300 మందితో బర్డ్ సర్వే
వచ్చే ఫిబ్రవరిలో నగరంలో బర్డ్ సర్వే జరగనుంది. నగరవ్యాప్తంగా 300 మంది ఈ సర్వేలో పాల్గొంటున్నారు. పార్కులు, చెరువులు, అటవీ ప్రాంతాల్లో పక్షులను గుర్తిస్తారు. నగరంలో పక్షుల సంఖ్యను తెలుసుకోవడంతో పాటు వాతావరణంలో వచ్చే మార్పులు పక్షులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ సర్వే ద్వారా తెలుస్తుందని నిర్వాహకులు ఫరీదా పేర్కొన్నారు.
News November 27, 2024
హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు
HYDలో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం <<14722224>>జీడిమెట్ల<<>>లోని కంపెనీలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటలు చల్లారకముందే <<14721016>>మణికొండ<<>>, <<14721091>>రామంతాపూర్<<>>లో రెండు సంఘటలు వెలుగుచూశాయి. 2024లో ఇప్పటివరకు HYD, MM, RRలో 1550కి పైగా ప్రమాదాలు జరగడం ఆందోళనకరం. ఇందులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ప్రమాదాలే ఎక్కువ. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.