News July 3, 2024

HYD: ప్రజాభవన్ వద్ద రూ.5 భోజనం ప్రారంభం

image

HYD బేగంపేట్‌లోని జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో ప్రజావాణికి ప్రతి మంగళ, శుక్ర వారాల్లో అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం హరేకృష్ణ మూమెంట్ సహకారంతో ప్రజాభవన్ వద్ద భోజనశాల ఏర్పాటు చేశారు. దాదాపు 400మందికి సరిపడేలా భోజనం ఏర్పాటు చేయగా, మధ్యాహ్నంలోగానే పూర్తయ్యింది.

Similar News

News January 16, 2025

HYD దగ్గరలో అందమైన టూరింగ్ స్పాట్

image

వికారాబాద్ జిల్లాలోని కోట్‌పల్లి రిజర్వాయర్ వీకెండ్ టూరిస్ట్ స్పాట్‌గా మారింది. ఇక్కడ బోటింగ్ చేస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ స్పోర్ట్స్ టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ 30 నిమిషాలకు సింగిల్ సీటర్‌కిరూ.300, డబుల్ సీటర్‌కి రూ.400గా నిర్ణయంచారు. ఈ బోటింగ్ సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. 10 ఏళ్ల‌లోపు పిల్లలకు ప్రవేశం లేదు.

News January 16, 2025

3 రోజుల్లో నుమాయిష్‌కు 2,21,050 మంది

image

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు 3 రోజుల్లో మొత్తం 2,21,050 మంది సందర్శకులు తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి రోజు ఎక్కువగా 76,500 మంది నుమాయిష్‌కు రాగా.. ఎగ్జిబిషన్‌లోని అన్ని స్టాల్స్ జనసంద్రంగా మారాయి. పాఠశాలలకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో మరో 2 రోజులు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని నిర్వాహకులు  అంచనా వేస్తున్నారు.

News January 16, 2025

సికింద్రాబాద్‌లో ముగిసిన కైట్ ఫెస్టివల్

image

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ బుధవారంతో ముగిసింది. 50 దేశాలకు చెందిన 150 మంది కైట్ ఫ్లైయర్స్ పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. సూపర్ హీరోలతో పాటు భారీ ఆకారంలో స్నేక్, గాడ్జిల్లా, వివిధ రకాల బొమ్మలు, హైదరాబాద్ మెట్రో సంస్థ(L&T)కు చెందిన ట్రైయిన్ కైట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది పరేడ్‌ గ్రౌండ్‌లో సంక్రాంతి సందర్భంగా ఎంజాయ్ చేశారు.