News January 3, 2025
HYD: ప్రమాణ పత్రం ఇవ్వాలనే దిక్కుమాలిన రూల్ ఏంటి: కేటీఆర్
రాష్ట్రంలో ప్రమాణ పత్రం ఇస్తేనే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. అదేం దిక్కుమాలని రూల్ అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. రైతు శాసించేలా కేసీఆర్ చూశారని.. నేడు రైతులు యాచించేలా కాంగ్రెస్ సర్కార్ చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే రైతుబంధు ఒక సీజన్ ఎగ్గొట్టారని.. అది కూడా రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Similar News
News January 7, 2025
HYD: నిర్లక్ష్యం వద్దు.. మళ్లీ మాస్కు ధరించండి
hMPV వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో HYD పరిధిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసింది. నమస్కారం ముద్దు – హ్యాండ్‌షేక్ వద్దు’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. షేక్ హ్యాండ్స్ కారణంగా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మాస్క్, శానిటైజర్ తప్పనిసరి అని తెలిపింది.
News January 7, 2025
HYD: నుమాయిష్‌కు వెళుతున్నారా? నేడు లేడీస్ డే..!
84వ నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో మంగళవారం లేడీస్ డే నిర్వహిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు కే.నిరంజన్, కార్యదర్శి సురేందర్ రెడ్డి వెల్లడించారు. ఎగ్జిబిషన్ మంగళవారం కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. మహిళలకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. ఉమెన్స్ స్పెషల్ డే ప్రోగ్రామ్‌కు రాష్ట్ర జైళ్ల శాఖ ఐజీ డాక్టర్ సౌమ్య మిశ్రా పాల్గొంటున్నట్లు తెలిపారు.
News January 7, 2025
పార్లమెంటులో బీసీ బిల్లుకు ఓత్తిడి పెంచాలి: కృష్ణయ్య
పార్లమెంటులో బీసీ బిల్లుకు చంద్రబాబునాయుడు కేంద్రంపై ఓత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తల ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా బోను దుర్గా నరేశ్‌ను ఎంపిక చేసి, ఆయనకు నియామకపత్రం అందచేశారు.