News April 8, 2024
HYD: ప్రారంభానికి నోచుకోని రాష్ట్ర మత్స్య శిక్షణా కేంద్రం

రాష్ట్ర మత్స్య శిక్షణా కేంద్రాన్ని మేడ్చల్‌లో నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని మత్స్య సంఘాల సభ్యులకు చేపల పెరుగుదల, వాటికి సోకే రోగాలు, ఉత్పత్తి తదితర అంశాలపై ఈ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలోనే కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ పలుమార్లు వాయిదా పడగా.. ప్రస్తుత ప్రభుత్వమైన TSFTIని ప్రారంభించాలని మత్స్యకారులు కోరుతున్నారు.
Similar News
News April 21, 2025
HYD: అర్ధరాత్రి యువతిని కాపాడిన పోలీసులు

ఆత్మహత్య చేసుకుందామని యత్నించిన యువతి ప్రాణాలను పోలీసులు కాపాడారు. స్థానికుల వివరాలు.. రాత్రి 11:30 సమయంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి ఓ యువతి దూకబోయింది. ఇదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు వెంకటేశ్, కృష్ణయ్య అప్రమత్తమయ్యారు. చెరువులో దూకే చివరి నిమిషంలో ఆమెను అడ్డుకొని బ్రిడ్జి మీదకు తీసుకెళ్లారు. ఆమెను రక్షించి, కౌన్సెలింగ్ ఇచ్చారు.
News April 21, 2025
డబుల్ ఇంజిన్ సర్కారుతో HYD అభివృద్ధి.. మీ కామెంట్?

TGలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే నగర అభివృద్ధి సాధ్యమని ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYD MLC ఎన్నికల వేళ ఆయన కాంగ్రెస్, BRS, MIMపై తీవ్ర విమర్శలు చేశారు. మజ్లీస్ పార్టీ కోసం ఈ రెండు ప్రధాన పార్టీలు పోటీ చేయడం లేదన్నారు. HYDను బలిచేసేందుకు INC, BRS వెనుకడుగువేయడం లేదని ఆరోపించారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోటీ చేస్తుంది BJP ఒక్కటే అంటోన్న కిషన్ రెడ్డి ప్రసంగంపై హైదరాబాదీ మీ కామెంట్?
News April 20, 2025
HYD: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి

క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి దాయరలో ఆదివారం కొందరు యువకులు క్రికెట్ కోసం త్యాగి వెన్యూ గ్రౌండ్ బుక్ చేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో క్రికెట్ ఆడుతూ ప్రణీత్ (32) ఒక్కసారి కుప్పకూలాడు. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందినట్లు తెలుస్తోంది.