News February 6, 2025
HYD: ఫుడ్ ఆర్డర్.. బిర్యానీలో ఈగ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738780800473_18637821-normal-WIFI.webp)
ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ పెట్టిన కస్టమర్ షాకయ్యాడు. బాధితుడు రామకృష్ణ వివరాలు.. ‘చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశాను. భోజనం తినే సమయంలో అందులో చనిపోయిన ఈగ దర్శనమిచ్చింది. కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేశాను. హోటల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఇటువంటి హోటల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అంటూ Way2Newsకు తెలిపారు.
Similar News
News February 6, 2025
గచ్చిబౌలిలో కాల్పులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్ (UPDATE)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738830986829_705-normal-WIFI.webp)
గచ్చిబౌలి ప్రీజం పబ్ కాల్పుల కేసులో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాఫ్ట్వేర్ ఇంజినీర్ రంజిత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ను అరెస్టు చేశారు. అతడికి ఆశ్రయం ఇచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ చోరీ చేసిన డబ్బును రంజిత్ బ్యాంకు ఖాతాలో జమ చేసేవాడని పోలీసులు వెల్లడించారు.
News February 6, 2025
HYD: KCR రాజీనామా చేయాలా.. వద్దా..?: (VIRAL)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738819675988_705-normal-WIFI.webp)
GHMC కార్పొరేటర్ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి BRS తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ‘అసెంబ్లీకి రాని, ప్రజల సమస్యలు పట్టించుకోని KCR గారు గజ్వేల్ MLAగా రాజీనామా చేయాలా..? వద్ద..?’ అని ప్రశ్నించారు. దీనిపై ఇరు పార్టీల సోషల్ యాక్టివిస్ట్‌లు స్పందించారు. నిజమే అని BJP శ్రేణులు.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏంటని BRS నేతలు పోటీ పడటం గమనార్హం.
News February 6, 2025
HYD: ఒకే రోజు 10 మంది మృతి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738817515071_705-normal-WIFI.webp)
HYDలో విషాద ఘటనలు వెలుగుచూశాయి. నిన్న ఒక్కరోజే 10 మంది చనిపోయారు. LBనగర్లో గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. గచ్చిబౌలిలో రిటోజ, SRనగర్లో అమర్జిత్, రాయదుర్గంలో ధర్మప్రధాన్, షాద్‌నగర్‌లో నీరజ్, చెరువులో దూకి పీర్జాదిగూడ వాసి బాలరాజు, మీర్‌పేటలో వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నారు. వేర్వేరు కారణాలతో ఆరుగురు సూసైడ్ చేసుకోగా.. శంకర్‌పల్లిలో బస్ ఢీ కొని బీటెక్ విద్యార్థి మృతి చెందడం బాధాకరం.