News April 2, 2024
HYD: బస్ షెల్టర్లు లేక.. మండే ఎండలో ప్రయాణికులు!
HYDలోని హిమాయత్‌నగర్, నారాయణగూడ, కాచిగూడ, అమీర్‌పేట్, ఉప్పల్, బాటసింగారం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో బస్ షెల్టర్లు అందుబాటులో లేవు. దీంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, విద్యార్థులు 43 డిగ్రీలకు పైగా దంచి కొడుతున్న మండే ఎండలో నిలబడి అలసిపోతున్నారు. ఏర్పాటు చేసిన చోటే అధికంగా ఉండడంతో పలుచోట్ల ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బస్ షెల్టర్లు అవసరమైన చోట ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News January 18, 2025
JNTU: కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఇంటర్వ్యూ
JNTU అఫిలియేటెడ్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సంబంధించి అఫిలియేటెడ్ ఆడిట్ సెల్ డైరెక్టర్ తారా కళ్యాణి ఆధ్వర్యంలో వర్సిటీలో ఫ్యాకల్టీలకు ఇంటర్వ్యూలో నిర్వహించారు. ఈనెల 17వ తేదీ నుంచి 20 వరకు ఈ ఇంటర్వ్యూలు కొనసాగుతాయని వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ బాలకిష్టారెడ్డి తెలిపారు. రసాయన, ఆంగ్ల, గణిత శాస్త్ర విభాగానికి సంబంధించి అభ్యర్థులకు వీసీ ఇంటర్వ్యూ నిర్వహించారు.
News January 18, 2025
HYD: ఇంటర్ విద్యార్థుల ALERT.. ఈనెల 25 వరకు అవకాశం
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులను ఇంటర్మీడియట్ బోర్డు అప్రమత్తం చేసింది. వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజును ఇప్పటికీ చెల్లించని విద్యార్థులు.. ఆలస్య రుసుం రూ. 2500తో జనవరి 25 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఇంటర్ రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థులతో పాటు ప్రైవేటు విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
News January 18, 2025
HYD: రాష్ట్రంలో రేవంత్ దోపీడీ ముఠా: కేటీఆర్
రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దోపీడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతుందని మాజీమంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రగతి భవన్లో చిట్ చాట్‌లో KTR మాట్లాడుతూ.. రేవంత్ సోదరులతో పాటు ఆరుగురి టీం కంపెనీల నుంచి వసూళ్ల కోసం రేవంత్ రెడ్డి తిప్పుతున్నాడని అన్నారు. తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోనిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏవి రెడ్డితో కూడిన ఆలీబాబా అర డజన్ దొంగల గ్యాంగ్ తెలంగాణలో తిరుగుతుందని అన్నారు.