News February 5, 2025

HYD: బాలికతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

image

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కిరణ్ అనే యువకుడికి ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్డు ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. పోలీసుల వివరాలిలా.. సరూర్ నగర్ పరిధికి చెందిన కిరణ్ ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన 2020లో జరగ్గా కేసు నమోదైంది. తాజాగా కోర్టు శిక్ష విధించింది.

Similar News

News February 6, 2025

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం రద్దు

image

AP: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రణాళికా విభాగం ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. వైసీపీ హయాంలో ఈ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీసేవారు. అర్హత ఉండి ఏదైనా పథకం అందకపోతే అప్లై చేసేవారు. అయితే ఇది వైసీపీ కార్యక్రమంగా మారిందని అప్పట్లో టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు.

News February 6, 2025

విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్

image

పాఠశాల విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రతిపాదనలను పంపాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను కోరారు. బుధవారం పాఠశాలల బలోపేతం- రీస్ట్రక్చరింగ్ అంశంపై కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వలసకు వెళ్లే విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని అన్నారు. పాఠశాలలు అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు ఉండాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

News February 6, 2025

పెద్దపల్లి: ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో వైద్య అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పేషెంట్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు.

error: Content is protected !!