News January 29, 2025
HYD బ్రాండ్ ఇమేజ్ పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

HYD, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచుతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దావోస్ పెట్టుబడులపై ఆయన మంగళవారం వివరాలు వెల్లడించారు. మూసీ నది ప్రక్షాళన, నిరుద్యోగ యువతి యువకుల నైపుణ్యం పెంచేలా సింగపూర్‌లో CM చర్చలు జరిపారన్నారు. HYD ప్రజలకు మెరుగైన జీవనం కల్పించేలా ప్రస్తావించామన్నారు. సింగపూర్ మంత్రులు దీనిపై ఆసక్తి చూపించారన్నారు. యువత భవిష్యత్తు కోసమే యంగ్ ఇండియా యూనివర్సిటీ తీసుకొచ్చామన్నారు.
Similar News
News March 14, 2025
నిర్మల్ : రేపు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశం

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించాలని డీఈఓ రామారావు గురువారం ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వాన లేఖలను అందించాలన్నారు. సమావేశంలో ఏజెండాలోని అన్ని అంశాలను చర్చించేలా చర్యలు తీసుకోవాలని HMలకు సూచించారు.
News March 14, 2025
రామగుండం: సంప్రదాయ పద్ధతిలో హోలీ జరుపుకోవాలి: CP

రేపటి హోలీ సందర్భంగా ప్రతి ఒక్కరూ సంప్రదాయ పద్ధతిలో పండుగను నిర్వహించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మహిళల పట్ల మర్యాదగా ఉంటూ హోలీ జరుపుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. శివారు ప్రాంతాలకు స్నానాల కోసం వెళ్లవద్దని యువతకు సూచించారు. ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
News March 14, 2025
భద్రాచలంలో వైభవంగా తీర్థ బిందె పూజలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో గురువారం తీర్థ బిందె కార్యక్రమం విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.