News July 3, 2024

HYD: బ్రీత్ అనలైజర్‌‌తో పరారీ.. మందుబాబు అరెస్ట్

image

డ్రంక్‌ డ్రైవ్‌ తనిఖీల్లో సహకరించకుండా బ్రీత్ అనలైజర్‌ లాక్కొని పరారీ అయిన వాహనదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన్‌పల్లిలో జూన్ 27న తనిఖీలు నిర్వహించారు. కారులో వస్తున్న శ్రవణ్ కుమార్‌‌ను ఆపి టెస్ట్ చేయబోయారు. ఒక్కసారిగా బ్రీత్ అనలైజర్‌ను లాక్కున్న అతడు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా అతడిని అరెస్ట్ చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News January 29, 2025

HYD బ్రాండ్ ఇమేజ్ పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

image

HYD, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచుతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దావోస్ పెట్టుబడులపై ఆయన మంగళవారం వివరాలు వెల్లడించారు. మూసీ నది ప్రక్షాళన, నిరుద్యోగ యువతి యువకుల నైపుణ్యం పెంచేలా సింగపూర్‌లో CM చర్చలు జరిపారన్నారు. HYD ప్రజలకు మెరుగైన జీవనం కల్పించేలా ప్రస్తావించామన్నారు. సింగపూర్ మంత్రులు దీనిపై ఆసక్తి చూపించారన్నారు. యువత భవిష్యత్తు కోసమే యంగ్ ఇండియా యూనివర్సిటీ తీసుకొచ్చామన్నారు.

News January 28, 2025

విషాదం: హుస్సేన్‌సాగర్‌‌లో మృతదేహం లభ్యం

image

హుస్సేన్‌సాగర్‌‌లో అజయ్ మృతదేహం లభ్యమైంది. ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన నాగారం వాసి అజయ్ కోసం కోసం DRF, NDRF దాదాపు 45 గంటలు గాలించాయి. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని వెలికితీశాయి. కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటికే ఒకరు మృతి చెందారు. భారత మాత హారతి కార్యక్రమంలో టపాసులు కాల్చుతుండగా ప్రమాదం జరగగా పలువురు గాయపడ్డారు. తప్పించుకునే క్రమంలో అజయ్ నీటిలో దూకేసినా ప్రాణాలు దక్కకపోవడం బాధాకరం.

News January 28, 2025

HYD: ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం: సీఎం

image

రాష్ట్రంలో టెంపుల్, ఎకో, హెల్త్ టూరిజం వెనుకబడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అటవీ ప్రాంతాల సందర్శనకు మధ్యప్రదేశ్, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. మందిరాల దర్శనాల కోసం తమిళనాడు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నామని, అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదన్నారు. పర్యాటక పాలసీ తీసుకువచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామన్నారు.