News October 9, 2024

HYD: భర్త బయటపెట్టిన వీడియోలపై స్పందించిన దివ్యజ్యోతి

image

HYD మణికొండ డీఈఈ దివ్యజ్యోతిపై ఆమె భర్త శ్రీపాద్ అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె నిత్యం లంచం తీసుకుంటుందని పేర్కొంటూ.. నోట్ల కట్టలతో కూడిన వీడియోలను రిలీజ్ చేశారు. దీనిపై దివ్యజ్యోతి స్పందించారు. తాము గత సంవత్సరం నుంచి దూరంగా ఉంటున్నామని పేర్కొన్నారు. కోర్టులో విడాకుల కేసు నడుస్తోందని వెల్లడించింది. కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News October 10, 2024

HYD: మూసీలో తగ్గుతోన్న ఆక్సిజన్!

image

HYD మూసీ కాలుష్య కాసారంగా మారుతోంది. నీటిలో కరిగే ఆక్సిజన్ స్థాయి రోజురోజుకు తగ్గుతోంది. ఇదే సమయంలో రసాయనాల స్థాయి పెరుగుతుందని CPCB తెలిపింది. నీటిలో కరిగే ఆక్సిజన్(DO) CPCB ప్రకారం లీటర్ నీటిలో 6 మిల్లీ గ్రాములు ఉండాలి. కానీ, గండిపేట-6, బాపూ‌ఘాట్, ముసారాంబాగ్, నాగోల్, పీర్జాదిగూడ, ప్రతాపసింగారం, పిల్లాయిపల్లిలో 0.3 మాత్రమే ఉండటం ఆందోళనకరం. దీంతో మూసీలో జలచరాలు బతకడం కష్టమే.

News October 10, 2024

ALERT: సద్దుల బతుకమ్మ.. HYD‌లో ఈ రూట్ బంద్

image

సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో HYD పోలీసులు ఆంక్షలు విధించారు. అమరవీరుల స్మారకస్తూపం నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌లోని బతుకమ్మ ఘాట్ వరకు సాధారణ వాహనాలకు అనుమతించరు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్ చుట్టూ బతుకమ్మ వేడుక కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

News October 9, 2024

HYD: బస్సులు, రైళ్లు FULL.. వామ్మో కష్టమే..!

image

హనుమకొండ, వరంగల్, తొర్రూరు, ఖమ్మం సహా ఇతర ప్రాంతాలకు HYD నగరం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సొంతూర్లకు వెళ్తున్నారు. రేపు సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో సాయంత్రం వేళ రైళ్లు, బస్సుల్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. కనీసం కూర్చునే పరిస్థితి లేదని ప్రయాణికులు వాపోయారు. రైళ్లలో వెళ్తున్న వారు ప్రతి స్టేషన్‌లో దిగి మళ్లీ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.