News April 3, 2025

HYD: భారీ వర్షం.. ప్రజలకు జలమండలి ఎండీ సూచనలు

image

భారీ వర్షంతో అధికారులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అప్రమత్తం చేశారు. హాట్ స్పాట్లపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. మ్యాన్ హోళ్ల మూతలు తెరవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసు శాఖల అధికారులతో కలిసి సమన్వయంతో వ్యవహరించాలన్నారు.

Similar News

News April 10, 2025

HYDలో ఒక్కసారిగా మారిన వాతావరణం

image

నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, ఉప్పల్, ముషీరాబాద్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. నగరశివారుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. షాద్‌నగర్‌‌లో అయితే భారీ వర్షం కురిసింది. వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉంది. కామెంట్ చేయండి
PIC CRD: @prudhvikoppaka

News April 10, 2025

FLASH..శంషాబాద్‌లో ఫ్లైట్ దిగగానే మాజీ MLA అరెస్ట్

image

బోధన్ మాజీ MLA షకీల్‌ను శంషాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలలుగా దుబాయ్‌లో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే.. తల్లి అంత్యక్రియల కోసం HYDకు వచ్చారు. ఎయిర్‌పోర్టులో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పోలీసు శాఖ గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. బేగంపేట్ ప్రగతి భవన్ వద్ద యాక్సిడెంట్‌లో సాక్షాలు తారుమారు చేసి కుమారుడిని రక్షించేందుకు యత్నించినట్లు ఆయన మీద అభియోగాలు ఉన్నాయి.

News April 10, 2025

HYD: నా భార్యను ఎన్కౌంటర్ చేయండి: చెన్నయ్య

image

అమీన్‌పూర్‌లో ముగ్గురు పిల్లలను తల్లి రజిత చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనపై రజిత భర్త చెన్నయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రజిత నమ్మించి తన గొంతు కోసిందన్నారు. పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయినా తాను పిల్లల్ని బంగారంలా చూసుకునేవాడినని తెలిపారు. పిల్లల్ని చంపినందుకు కనీసం ఆమెకు పశ్చాత్తాపం లేదని.. రజిత, ప్రియుడు శివను ఎన్కౌంటర్ చేయాలన్నారు.

error: Content is protected !!