News January 7, 2025

HYD: భారీగా పట్టుబడ్డ నకిలీ పన్నీరు

image

హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిసరి ఎంక్లేవ్‌లో నకిలీ పన్నీరు భారీ మొత్తంలో పట్టుబడింది. విశ్వసనీయ సమాచారంతో నకిలీ పన్నీరు తయారు కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేపట్టారు. నిందితులను పట్టుకొని అల్వాల్ పోలీసులకు అప్పగించారు. అక్కడ సుమారు 600 కిలోల పన్నీరు, కొన్ని రకాల కెమికల్స్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బేగం బజార్‌కు చెందిన ఓ వ్యాపారి దీన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం.

Similar News

News January 8, 2025

HYD: బీర్ల రేటు పెంపుపై కమిటీ నిర్ణయమే ఫైనల్‌: మంత్రి 

image

బీర్ల రేట్లు పెంచనందుకు బీర్ల స్టాక్ పంపమని బేవరేజ్ సంస్థ ప్రకటించింది. 33శాతం పెంచమని అడుగుతున్నారని, ఇలా పెంచితే ఇప్పుడు రూ.150 రూపాయలు ఉన్న బీర్ రూ.250 పెరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బేవరేజ్ సంస్థ అడిగినట్లు రేట్లు పెంచితే ప్రజలపై భారం పడుతుందన్నారు. రేట్లు పెంచే సిస్టం కోసం రిటైర్డ్ జడ్జితో కమిటీ వేశామన్నారు. కమిటీ నివేదిక వచ్చాక రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

News January 8, 2025

HYD: 2024లో జైళ్లకు 41,138 మంది ఖైదీలు: డీజీ

image

2024లో వివిధ కేసుల్లో జైలుకు వచ్చిన వారి సంఖ్య భారీగా పెరిగిందని, ఈ ఏడాదిలో 41,138 మంది జైలుకు వచ్చారని ఆ శాఖ డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు. HYDలో సౌమ్య మిశ్రా జైళ్ల వార్షిక నివేదికను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. 2024లో హత్యకేసుల్లో 2,754 మంది శిక్ష అనుభవిస్తున్నట్లు తెలిపారు. 2024లో పోక్సో కేసుల్లో 3,655 మంది పురుషులు, 94 మంది మహిళలు జైళ్లలో ఉన్నట్లు చెప్పారు.

News January 8, 2025

HYD: 100పడకల ఆస్పత్రిగా అమీర్‌‌పేట్ హెల్త్ సెంటర్: మంత్రి 

image

50 పడకల ఆసుపత్రిగా ఉన్న అమీర్‌పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌లో వంద పడకల ఆస్పత్రిగా ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌‌లోని అమీర్‌పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంత్రి సందర్శించి ఆస్పత్రిలో సర్జరీ వార్డ్, గర్భిణీల వార్డ్, ఫార్మసి, చిన్నపిల్లలకు మందులు ఇచ్చే గది, రిజిస్టర్‌లను పరిశీలించారు.