News April 19, 2024

HYD: మంచు శిఖరాన్ని అధిరోహించిన NCC గ్రూప్

image

తెలంగాణ బెటాలియన్ ఆఫ్ HYD NCC గ్రూప్ సభ్యులు క్యాడేట్ ఉపేందర్, సిద్ధార్థ అరుణాచల్ ప్రదేశ్ వద్ద 16,460 ఫీట్ల ఎత్తులో ఉన్న గోరీచేన్ గ్లిషియర్ మంచు శిఖరాన్ని అధిరోహించినట్లు HYD డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది. NIMAS ఇన్ స్టిట్యూట్ ఆధ్వర్యంలో NCC క్యాడెట్లకు పర్వతారోహణపై శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొంది. క్యాడేట్లు అద్భుత ప్రదర్శన చేశారని ప్రశంసించింది.

Similar News

News January 15, 2025

HYD: నుమాయిష్‌లో పోలీసుల బందోబస్తు

image

HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన నుమాయిష్‌కు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నుమాయిష్‌కు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోజూ ముగ్గురు ఏసీపీలు, 9 మంది ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ బృందాలతో బందోబస్తు, తనిఖీలు నిర్వహిస్తున్నారు.

News January 15, 2025

HYD: పోరాట యోధుడి జయంతి నేడు

image

1947లో ఇదే రోజు ప్రశ్నించే ఓ గొంతు జన్మించింది. 1960లో తొలిసారి ఆ కాలాతీత వ్యక్తి HYDలో అడుగుపెట్టారు. ఆయనే విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పిన జార్జ్‌రెడ్డి. 25ఏళ్ల వయసులో మార్క్స్, సిగ్మన్‌ఫ్రాయిడ్‌ వంటి ఫిలాసఫర్‌లను చదివేశారు. కేవలం ఉద్యమమే కాదు ఎదుటివారిని ఆలోచింపజేసే వక్త ఆయన. విద్యార్థి ఉద్యమం అంటే జార్జ్‌రెడ్డి గుర్తొచ్చేంతగా ఆయన పోరాటం.. ఓయూ నుంచే ప్రారంభం అవ్వడం హైదరాబాదీలకు గర్వకారణం.

News January 15, 2025

HYD: పొలం అనుకుంటే పొరపాటే..!

image

ఈ ఫోటోలో పచ్చని పైరులా కనిపించేది.. పొలం, నారుమడి అని అనుకుంటే పొరపాటే. HYD పరిధి కొండాపూర్ మజీద్‌బండ చెరువును గుర్రపు డెక్క కప్పేయడంతో ఇలా కనిపిస్తోంది. HYDలో అనేక చెరువుల పరిస్థితి ఇదే విధంగా ఉందని, గ్రేటర్ ప్రజలు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదులు చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోయారు. చెరువుల సుందరీకరణపై శ్రద్ధ ఎక్కడ..? అని ప్రశ్నించారు.