News August 23, 2024

HYD: మంత్రి కోమటిరెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ

image

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని HYD బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో కలిశారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు మంత్రిని కలిసిన మందకృష్ణ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మోత్కుపల్లి, MLAలు అడ్లూరి లక్ష్మణ్, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య ఉన్నారు.

Similar News

News November 26, 2024

HYD: నెమళ్ల సంఖ్య గతేడాది 565.. మరి ఈ ఏడాది..?

image

నగరంలో పేరుగాంచిన KBR పార్కులో నెమళ్ల సంఖ్య ఎంతో తెలుసుకోవాలనుకుంటే వచ్చేనెల 3వ తేదీ వరకు ఆగాల్సిందే. జాతీయ పక్షులు పార్కులో ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు ఇటీవల సర్వే నిర్వహించారు. ఆ వివరాలను డిసెంబర్ 3వ తేదీ ప్రకటిస్తామని పార్క్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గతేడాది KBR పార్కులో 565 నెమళ్లు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

News November 26, 2024

HYD: ‘కేంద్రం సొంత భావాలను అమలు చేస్తుంది’

image

సమగ్ర కుల గణనతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని మాజీ పీసీసీ చీఫ్ హనుమంతరావు అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో మాట్లాడారు. ‘రాజ్యాంగ దినోత్సవం రోజున రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ప్రజలందరిపై ఉంది. కేవలం రాహుల్ గాంధీ కాకుండా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలి. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనగదొక్కి తమ సొంత భావాలను అమలు చేస్తుంది’ అని మండిపడ్డారు.

News November 26, 2024

గాంధీ భవన్‌లో ఇంటలెక్చవల్ కమిటీ సమావేశం

image

నాంపల్లిలోని గాంధీ భవన్‌లో టీపీసీసీ ఇంటలెక్చవల్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ ఆనంతుల శ్యామ్ మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు మాజీ ఎంపీ వి. హనుమంతరావు తదితర నాయకులు ఉన్నారు.