News April 22, 2025
HYD: మన జిల్లాలకు వచ్చిన ర్యాంకుల వివరాలు

ఇంటర్ ఫస్టియర్‌లో..
మేడ్చల్ 77.21 శాతంతో స్టేట్ 1వ ర్యాంక్
రంగారెడ్డి 76.36 శాతంతో స్టేట్ 2వ ర్యాంక్
హైదరాబాద్ 66.68 స్టేట్ 7వ ర్యాంక్
వికారాబాద్ 61.31 స్టేట్ 12వ ర్యాంక్
ఇంటర్ సెకండియర్‌లో..
మేడ్చల్ 77.91 శాతంతో స్టేట్ 3వ ర్యాంక్
రంగారెడ్డి 77.53 శాతంతో స్టేట్ 4వ ర్యాంక్
వికారాబాద్ 68.20 స్టేట్ 21వ ర్యాంక్
హైదరాబాద్ 67.74 స్టేట్ 23వ ర్యాంక్
Similar News
News December 31, 2025
మున్సిపాలిటీల గ్రేడ్ పెరిగితే ఏమవుతుందో తెలుసా?

AP: EGDt జిల్లా కొవ్వూరు, WGDt జిల్లా తణుకు, శ్రీసత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీల గ్రేడ్ పెంచుతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గ్రేడ్-1లో ఉన్న తణుకు, గ్రేడ్-2లోని కదిరి మున్సిపాలిటీలను సెలక్షన్ గ్రేడ్‌కు, గ్రేడ్-3లో ఉన్న కొవ్వూరును గ్రేడ్-1కు పెంచింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, కేటాయించే బడ్జెట్ పెరుగుతుంది. రోడ్లు, నీరు, శానిటేషన్ వసతులు మెరుగవుతాయి.
News December 31, 2025
నిడదవోలులో విషాదం.. పదేళ్ల బాలుడి మృతి

నిడదవోలు మండలం మునిపల్లి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అత్తిలి భరత్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సమిశ్రగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల వేళ ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News December 31, 2025
నెల్లూరు : 2 నుంచి రీ సర్వే

నెల్లూరు జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే ప్రక్రియ జనవరి 2వ తేదీ నుంచి మొదలవుతోంది. AP రీసర్వే ప్రాజెక్టులో జిల్లా నందు 93 గ్రామాలు ఎంపిక చేశారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ నుంచి 26 గ్రామాలు, కావలి డివిజన్ నుంచి 26, గూడూరు డివిజన్ నుంచి 14, నెల్లూరు డివిజన్ 27 గ్రామాలు కలిపి 357270.62 ఎకరములు రీసర్వే చేయనున్నారు. రైతులు రీసర్వేలో పాల్గొనాలని జేసీ వెంకటేశ్వర్లు, DD వై.నాగశేఖర్ కోరారు.


