News April 5, 2024
HYD: మల్కాజిగిరిలో పోస్టర్ల కలకలం
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోస్టర్లు ప్రత్యక్షమై కలకలం రేపుతున్నాయి. పోస్టర్లలో నాన్ లోకల్ వర్సెస్ లోకల్ అంటూ ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటలను కలవాలంటే 166 కిలోమీటర్లు ప్రయాణం చేసి హుజూరాబాద్ వెళ్లాలని.. కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిని కలవాలంటే 59 కిలోమీటర్లు ప్రయాణం చేసి చేవెళ్ల వెళ్లాలని.. కానీ BRS అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ అని ఇక్కడే మనతోనే ఉంటారని పోస్టర్లలో రాశారు.
Similar News
News December 28, 2024
CA Resluts: ఆల్ ఇండియాలో హైదరాబాద్ నం.1
CA ఫలితాల్లో హైదరాబాద్ యువకుడు సత్తాచాటాడు. నగరానికి చెందిన హెరంబ్ మహేశ్వరి ఆల్ ఇండియాలో టాప్(నంబర్ 1) ర్యాంక్ సాధించారు. ఫైనల్ ఎగ్జామినేషన్‌లో 600 మార్కులకు 84.67 శాతంతో 508 మార్కులు సాధించారు. తిరుపతి వాసి రిషబ్ కూడా 508 మార్కులతో టాప్ ర్యాంక్‌లో నిలిచారు. అహ్మదాబాద్ యువతి రియా 3, కోల్‌కతా వాసి కింజల్ అజ్మేరా 4వ ర్యాంక్ సాధించారు.
News December 28, 2024
PJR.. నిన్ను హైదరాబాద్ మరువదు!
గ్రేటర్ రాజకీయాల్లో నేడు చీకటి రోజు. కార్మిక నాయకుడు, పక్కా హైదరాబాదీ P. జనార్దన్ రెడ్డి తుది శ్వాస విడిచిన రోజు. కార్మికనాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి ఖైరతాబాద్ నుంచి 5 సార్లు MLAగా గెలిచారు. పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘటన PJRదే. ఒంటి చేత్తో హైదరాబాద్, రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అటువంటి మాస్ లీడర్ గుండెపోటుతో 2007 DEC 28న కాలం చేశారు. నేడు PJR వర్ధంతి.
News December 28, 2024
HYD: న్యూ ఇయర్ వేడుకలు.. పోలీసుల తనిఖీలు
న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. 31ST నైట్ ఈవెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్, మత్తు పదార్థాలు వినియోగించవద్దని హెచ్చరిస్తున్నారు. OYO హోటల్స్, ఫాంహౌజ్‌లలో శుక్రవారం రాత్రి తనిఖీలు చేశారు. న్యూ ఇయర్ పేరిట ఇల్లీగల్ యాక్టివిటీస్ చేపడితే చర్యలు తీసుకుంటామన్నారు.
SHARE IT