News September 9, 2024

HYD: మాదాపూర్‌లో దేశంలోనే అతిపెద్ద సదస్సు

image

దేశంలోనే అతిపెద్ద ఇంధన పొదుపు సదస్సు హైదరాబాద్ వేదికగా కానుంది. సీఐఐ ఆధ్వర్యంలో 10 నుంచి 12వ తేదీ వరకు మాదాపూర్‌లోని HICCలో జరగనుంది. ఈ కార్యక్రమంలో 23వ ఎనర్జీ ఎఫిషియన్సీ సమ్మిట్, సీఐఐ నేషనల్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిల్వర్ జూబ్లీ, పవర్ ప్లాంట్ సమ్మిట్ 2024, పేపర్ టెక్ 2024, గ్రీన్ షుగర్ సమ్మిట్ 2024 వంటి 3 ప్రధాన రంగాలపై ప్రత్యేక సదస్సులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

Similar News

News December 30, 2024

HYD: న్యూ ఇయర్.. రిసార్టులకు ఫుల్ డిమాండ్..!

image

న్యూ ఇయర్ వేడుకలకు రిసార్టులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రేపు రాత్రి నుంచి 2025 న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు HYD శివారులోని మొయినాబాద్, చేవెళ్ల, కోటిపల్లి, శామీర్‌పేట, భువనగిరి, పాకాల, శ్రీశైలం, గోల్కొండ, మోకిలా ప్రాంతాల్లో రిసార్టులను బుక్ చేసుకున్నారు. ప్రేమ జంటల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రిసార్టుల్లో ఒక్క రోజుకు రూ.10-40 వేలుగా ఛార్జీలు ఉన్నాయి.

News December 30, 2024

గ్రేటర్లో ఓవైపు చలి.. మరోవైపు కరెంటు వినియోగం

image

గ్రేటర్ HYDలో ఓవైపు చలి పెరుగుతూ వస్తుంటే దానికి తగ్గట్టుగానే విద్యుత్ వినియోగం పెరుగుతూ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. HYDలో 3 వేల మెగావాట్లకుపైగా విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు పేర్కొంది. దాదాపు 56 యూనిట్లకు పైగా రికార్డులు నమోదు కాగా.. విద్యుత్ కనెక్షన్లు పెరగడం, పరిశ్రమల వాడకం, ఉదయం పూట ఇళ్లలో గీజర్లు వినియోగించడం కారణాలుగా అధికారులు చెప్పుకొచ్చారు.

News December 30, 2024

HYD: కనుమరుగవుతున్న చెరువులు..!

image

రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, HYD జిల్లాల పరిధిలో దాదాపుగా 24 చెరువులు పూర్తిగా కబ్జాకు గురై కనుమరుగైనట్లు TGRAC తెలిపింది. 2014కు ముందు ఈ ఆక్రమణలు జరిగినట్లుగా పేర్కొంది. రాష్ట్రం ఏర్పడ్డాక మేడ్చల్ జిల్లాలో 28, రంగారెడ్డి జిల్లాలో 22, సంగారెడ్డి జిల్లాలో 7 చెరువులు పాక్షిక ఆక్రమణకు గురయ్యాయని వెల్లడించింది.