News February 3, 2025

HYD: మీ పిల్లల్లో ఇలాంటి ప్రవర్తన గుర్తిస్తే జాగ్రత్త..!

image

మత్తుపదార్థాల వినియోగం యువతలో వేగంగా పెరుగుతుండటంతో రాచకొండ సీపీ సుధీర్ బాబు తల్లిదండ్రులకు ముఖ్యమైన హెచ్చరికను జారీ చేశారు. రేవ్‌పార్టీలు, అనుమానాస్పద మాత్రలు, రహస్య ప్రవర్తన వంటి ప్రారంభ లక్షణాలను గమనించడం వల్ల యువతను మత్తుపదార్థాల మాయాజాలం నుంచి కాపాడవచ్చన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడంతో సమస్యను ముందే గుర్తించి నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News February 4, 2025

అనకాపల్లి జిల్లాలో 98.07 శాతం పింఛన్లు పంపిణీ

image

ఎన్టీఆర్ భరోసా పథకం కింద అనకాపల్లి జిల్లాలో సోమవారం సాయంత్రం 6.10 గంటల వరకు 98.07 పింఛన్లను పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో లబ్ధిదారులు 2,57,457 మంది కాగా ఇప్పటివరకు 2,52,482 మందికి పింఛన్లను అందజేసినట్లు పేర్కొన్నారు. ఇంకా 4,975 మందికి పింఛన్లు అందజేయాల్సి ఉందన్నారు.

News February 4, 2025

అశ్వారావుపేట: ఎంపీటీసీ స్థానాల మార్పులకు కలెక్టర్ ఆమోదం

image

అశ్వారావుపేట పట్టణం మున్సిపాలిటీగా మారిన క్రమంలో ఎంపీటీసీ స్థానాల మార్పు అనివార్యమైంది. గతంలో మండల పరిధిలో 17ఎంపీటీసీ స్థానాలు ఉండగా 11స్థానాలకు కుదిస్తూ రూపొందించిన ఫైల్‌పై జిల్లా కలెక్టర్ సంతకం చేసినట్టు అధికారులు ప్రకటించారు. అందుకు సంభందించి వివరాలను స్థానిక ఎంపీడీవో, తహసీల్దార్, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నోటీసు బోర్డుపై ఉంచినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటన ద్వారా  తెలిపారు.

News February 4, 2025

తిరుమల: రథసప్తమి.. పోలీసులకు ఎస్పీ సూచనలు

image

TTD ప్రతి ఏటా వెంకటేశ్వర స్వామి వారి రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారని జిల్లా హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సోమవారం బందోబస్తు విధులకు హాజరైన సిబ్బందికి తిరుమల ఎస్.వి హై స్కూల్ గ్రౌండ్‌లో పలు సూచనలు చేశారు. పోలీసులు భక్తులతో గౌరవంగా, మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. రథసప్తమి రోజున ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకొనే విధంగా చర్యలు చేపట్టామన్నారు.