News March 15, 2025

HYD: ముప్పుగా మారుతున్న స్టంట్స్

image

రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి PVNR ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 276 వద్ద నుంచి డైరీ ఫామ్ రూట్లో కొంతమంది మైనర్లు నాలుగు వాహనాలపై ప్రమాదకరమైన ఫీట్లు (స్టంట్స్) చేస్తున్నారు. వీరి విన్యాసాలను చూసిన ఇతర వాహనదారులు భయపడుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

Similar News

News March 15, 2025

22 రోజులైనా దొరకని కార్మికుల జాడ

image

TG: SLBC టన్నెల్‌లో కార్మికులు చిక్కుకుపోయి 22 రోజులైనా వారి జాడ తెలియడం లేదు. రోబోకు అనుసంధానంగా లిక్విడ్ రింగ్ వాక్యూమ్ ట్యాంక్ యంత్రంతో రెస్క్యూ చేపడుతున్నారు. D-2 ప్లేస్‌లో 4 మానవ అవశేషాలు ఉన్నట్లు GPR స్కానర్ చూపినా అక్కడ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. దీంతో అక్కడ తవ్వకాలు నిలిపేసి హై రిస్క్ ఉన్న D-1 దగ్గర తవ్వకాలు జరపాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు ఒక మృతదేహం బయటపడిన విషయం తెలిసిందే.

News March 15, 2025

SKLM: పొట్టి శ్రీరాములు జయంతికి కలెక్టర్ పిలుపు

image

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు శ్రీకాకుళం పాత బస్ స్టాండ్‌లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి అధికారులు హాజరై నివాళులర్పించాలని కలెక్టర్ కోరారు.

News March 15, 2025

PPM: మూడు అంబులెన్స్‌లను అందించిన NPCI

image

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పార్వతీపురం మన్యం జిల్లాకు మూడు అంబులెన్స్‌లను అందించారు. ఈ అంబులన్స్‌లను సాలూరులో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించగా, పార్వతీపురంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, స్థానిక శాసన సభ్యులు బోనెల విజయ చంద్రతో కలసి శనివారం ప్రారంభించారు.

error: Content is protected !!