News January 3, 2025

HYD: మూసీ పొల్యూషన్..12 ప్రాంతాల గుర్తింపు..!

image

మూసీ పరివాహాక ప్రాంతాన్ని ప్రక్షాళన చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డుల ప్రకారం మొత్తం 12 హాట్ స్పాట్ కాలుష్య ప్రాంతాలను గుర్తించింది. HYD-2,MDCL-1,RR-2, యాదాద్రి-3, సూర్యాపేట-2, నల్గొండ-2 ఉన్నట్లుగా తెలిపింది. అంటే HYD బయట నుంచి వచ్చే పరిశ్రమలతో మూసీ కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నట్లు గుర్తించింది. త్వరలోనే లిస్టు విడుదల చేస్తామని పేర్కొంది.

Similar News

News January 7, 2025

HYD: నిర్లక్ష్యం వద్దు.. మళ్లీ మాస్కు ధరించండి

image

hMPV వైర‌స్ క‌ల‌క‌లం సృష్టిస్తున్న నేప‌థ్యంలో HYD ప‌రిధిలోని ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కీల‌క విజ్ఞ‌ప్తి చేసింది. న‌మ‌స్కారం ముద్దు – హ్యాండ్‌షేక్ వ‌ద్దు’ అనే నినాదాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించింది. షేక్ హ్యాండ్స్ కార‌ణంగా వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొకరికి వ్యాపించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మాస్క్, శానిటైజర్ తప్పనిసరి అని తెలిపింది.

News January 7, 2025

HYDలో భారీగా పెరిగిన ఓటర్లు

image

రాష్ట్రవ్యాప్తంగా తుది ఓటరు జాబితాను విడుదలైంది. రంగారెడ్డి, HYD, మేడ్చల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి 1.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం అత్యధికంగా 7.65 లక్షల మంది ఓటర్లతో మొదటి స్థానంలో ఉండగా.. 2.32 లక్షలమంది ఓటర్లతో చివరి స్థానంలో చార్మినార్ ఉంది. కేవలం ఒక్క ఏడాదిలోనే 2 లక్షల మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు.

News January 7, 2025

HYD: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

image

HYDలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు ఇచ్చింది. 2018లో వనస్థలిపురం PS పరిధిలో తాపీ మేస్త్రిగా పనిచేసే కార్తిక్(22) ఓ బాలికను ప్రేమపేరుతో మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది.