News March 9, 2025

HYD: మెట్రోలో గుండె తరలించిన వైద్యులు

image

HYD మెట్రో అరుదైన ఘనత సొంత చేసుకుంది. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి మెట్రోలో గుండెను తరలించారు. డయిలేటెడ్ కార్డియోమయోపతి సమస్యతో బాధపడుతున్న 44 ఏళ్ల వ్యక్తికి శనివారం ఎమర్జెన్సీ అవ్వగా వారు మెట్రోనే ఎంచుకున్నారు. వైద్యులు నాగోల్‌లో మెట్రో‌ ఎక్కి జూబ్లీహిల్స్‌లో దిగారు. ఇలా గుండెను తరలించడాన్ని గ్రీన్ ఛానల్ అంటారు.

Similar News

News March 10, 2025

PHOTOS: ట్రోఫీతో క్రికెటర్లు

image

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గి భారత జట్టు 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ధోనీ సారథ్యంలో 2013లో గెలిచాక 2017లోనూ అవకాశం వచ్చినా ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి పాలైంది. అయితే ఈ సారి వచ్చిన ఛాన్స్‌ను రోహిత్ సేన ఒడిసిపట్టుకుంది. హిట్ మ్యాన్ నాయకత్వంలో సమిష్టిగా రాణిస్తూ ఒక్క ఓటమి లేకుండా కప్పును అందుకుంది. ఈ క్రమంలో కప్పుతో క్రికెటర్లు ఫొటోలకు పోజులిచ్చారు.

News March 10, 2025

MBNRలో 700 ఏళ్ల నాటి మర్రిచెట్టు!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 700 ఏళ్లనాటి మర్రి చెట్టు అందరినీ ఆకట్టుకుంటుంది. దేశంలోనే అతిపెద్ద పరిమాణం గల మూడో చెట్టుగా ఇది పేరుగాంచింది. దూరం నుంచి చూస్తే కొండలాగా కనిపించే ఇది దగ్గరికెళ్ళి చూస్తే వెయ్యిమందికి నీడనిచ్చే పెద్ద గొడుగులాగా మారిపోతుంది. మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న దీని పక్కనే మ్యూజియం, జింకలపార్కు ఉన్నాయి. మహబూబ్ నగర్ పట్టణానికి 4KM దూరంలోనే ఉంది. సందర్శించారా? కామెంట్ చేయండి.

News March 10, 2025

మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి సమచిత స్థానం

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ సెక్రటరీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ పేరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఖరారు చేసినందుకు ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం దక్కుతుందని ఆనందం వ్యక్తం చేశారు.

error: Content is protected !!