News April 7, 2024

HYD: మేమంతా మీ వెంటే ఉంటాం: పద్మారావుగౌడ్

image

ఏ పిలుపు ఇచ్చినా ముందుకు నడిచే ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు పేరుపేరునా కృతజ్ఞతలని ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి టీ.పద్మారావు గౌడ్ అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేకున్నా అధైర్య పడవద్దని, మేమంతా మీ వెంటే ఉంటామని ఆయన కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఆదివారం సికింద్రాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.

Similar News

News November 25, 2024

HYD: అక్రమ కనెక్షన్లపై ఫిర్యాదు చేయండి: MD

image

HYDలో జ‌ల‌మండ‌లి అధికారుల నుంచి అనుమ‌తి లేకుండా అక్రమంగా తాగునీటి నల్లా, సీవ‌రేజ్ పైపులైన్ కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. అక్రమ నల్లా, సీవ‌రేజ్ కనెక్షన్లు గుర్తిస్తే.. జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989987135 ఈ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని ఎండీ అశోక్ రెడ్డి ప్రజలను కోరారు.

News November 25, 2024

HYD: అక్రమ కనెక్షన్లపై ఫిర్యాదు చేయండి: MD

image

HYDలో జ‌ల‌మండ‌లి అధికారుల నుంచి అనుమ‌తి లేకుండా అక్రమంగా తాగునీటి నల్లా, సీవ‌రేజ్ పైపులైన్ కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. అక్రమ నల్లా, సీవ‌రేజ్ కనెక్షన్లు గుర్తిస్తే.. జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989987135 నంబర్ల ద్వారా సమాచారం అందించాలని ఎండీ అశోక్ రెడ్డి ప్రజలకు సూచించారు.

News November 25, 2024

HYD: నేడే రవీంద్రభారతిలో బీసీల రణభేరి: ఆర్.కృష్ణయ్య

image

BC సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య 18 డిమాండ్లతో బీసీ రణభేరి మహాసభ నేడు రవీంద్రబారతిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాజకీయ పార్టీల నాయకులను ఈ సభకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం, పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, అసెంబ్లీలో 50% రిజర్వేషన్ల అమలు, కేంద్ర జనగణనలో కులగణన వంటివి తమ డిమాండ్లలో ఉన్నాయని తెలిపారు. బీసీలందరం ఏకమవుదాం అన్నారు.