News December 24, 2024

HYD: మైనర్లు వాహనాలు నడపొద్దు: ఎంపీ ఒవైసీ

image

మైనర్లు బైకర్స్, కార్లు నడపడం తగదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకునేందుకు HYD బండ్లగూడలోని ఆర్టీఏ కార్యాలయానికి మంగళవారం ఒవైసీ వచ్చారు. ఈ సందర్భంగా రెన్యువల్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం ఒవైసీ మీడియాతో మాట్లాడారు. మైనర్లు వాహనాలు నడపడం తగదని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News

News December 25, 2024

HYD: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివ చరణ్ రెడ్డి

image

తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జక్కిడి శివ చరణ్ రెడ్డిని తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ మేరకు నేడు ఢిల్లీలో ఉదయ్ భాను చిబ్‌, ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ & నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ క్రిష్ణ అల్లవరు‌ను శివ చరణ్ రెడ్డి కలిశారు. ఈ క్రమంలో ఆయనకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు నియామక పత్రం అందజేశారు.

News December 25, 2024

శంషాబాద్‌లో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం

image

ఉపరాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధన్‌ఖడ్ దంపతులకు శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి మెద‌క్ జిల్లాలోని తునికిలోని ఐసీఏఆర్ విజ్ఞాన కేంద్రానికి షెడ్యూల్ ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లారు. విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ పంటలు పండిస్తున్న సుమారు 500 మంది రైతులతో ఉపరాష్ట్రపతి మాట్లాడుతారు.

News December 25, 2024

HYD: సంపులో నాగు పాము (PHOTO)

image

సంపులో నాగు పాము ప్రత్యక్ష్యమైంది. స్థానికుల వివరాలు.. హైదర్‌షాకోట్ బైరాగిగూడలోని ఓ ఇంట్లో పాము దూరింది. ఒక్కసారిగా సంపులో పడిపోయింది. పైకి ఎక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ పడగ విప్పి బుసలు కొట్టింది. భయాందోళనకు గురైన కుటుంబీకులు, స్థానికులు వెంటనే స్నేక్ సొసైటీకి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచాక్యంగా పామును పట్టుకొని, అక్కడి నుంచి తరలించారు.