News October 29, 2024
HYD: రూ.205 కోట్లు దోచుకున్నారు!
HYD పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2 వేలకు పైగా సైబర్ క్రైమ్ కేసులు నమోదు అయినట్లుగా అధికారులు తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఏడాది ఏకంగా రూ.205 కోట్లకు పైగా దోచుకున్నారు. బాధితుల్లో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. మరోవైపు దాదాపు 70 శాతం మంది విద్యావంతులే ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. మాయ మాటలు నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News November 5, 2024
HYD: రాహుల్ గాంధీ బావర్చీకి రావాలని డిమాండ్
HYDలో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్‌నగర్‌కు రావాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బావర్చీలో కుర్చీ వేసి, ప్లేట్‌లో బిర్యానీ వడ్డించారు. బిర్యానీ చల్లబడకముందే రావాలని BRS సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి సూచించారు. పలువురు నిరుద్యోగులు కూడా రాహుల్ గాంధీ రావాలని కోరారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
News November 5, 2024
HYD: ఆటో డ్రైవర్ల మహా ధర్నాకు కేటీఆర్
నేడు ఆటో డ్రైవర్లు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నాను నిర్వహించనున్నారు. కాగా ఈ మహా ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. అయితే ఈరోజు నిర్వహించే మహా ధర్నాను అన్ని వాహన సంఘాలతో కలిసి విజయవంతం చేస్తామని ఆటో యూనియన్ జేఏసీ స్పష్టం చేసింది.
News November 5, 2024
HYD: మహిళపై ముగ్గురి అత్యాచారం
అమీర్‌పేట్: మధురానగర్ PS పరిధిలో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇళ్లలో పనికి వెళ్లే ఓ మహిళ నిన్న కొండాపూర్‌లో పనికెళ్లి తిరిగొస్తుండగా ఆటోలో ముగ్గురు వచ్చి తమ గదిలో బట్టలు ఉతకాలని చెప్పి ఆమెను తీసుకెళ్లి రూమ్‌లో బంధించారు. నోట్లో బట్టలు కుక్కి, తీవ్రంగా కొట్టి ఆమెపై అత్యాచారం చేశారు. తప్పించుకున్న ఆమె దుస్తులు లేకుండా బయటకు రాగా పక్కింటి మహిళ గమనించి నైటీ ఇచ్చారు. కేసు నమోదైంది.