News March 24, 2025
HYD: రూ.5లక్షలు కాజేసిన సుడో పోలీసులు

HYD: బోయినపల్లిలో సుడో పోలీసు డబ్బులు కాజేశాడు. రాత్రి సమయంలో వాహనం తనిఖీ చేయలంటూ ద్విచక్ర వాహనదారుడిని సూడో పోలీసులు ఆపారు. పోలీస్ డ్రెస్‌లో ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ తనిఖీ చేశారు. వాహణదారుడి దగ్గర రూ. 5లక్షల బ్యాగు ఉండటం చూసి వివరాలు అడిగారు. పోలీస్టేషన్‌కు వచ్చి వివరాలు చెప్పి డబ్బులు తీసుకవెళ్లలంటూ బ్యాగుతో పరారీ అయ్యారు. ఈమేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
Similar News
News March 29, 2025
కూకట్‌పల్లి: డబ్బులు విషయంలో ఒత్తిడి తట్టుకోలేక వ్యక్తి అదృశ్యం

ఇంటి నిర్మాణానికి సంబంధించి EMI కట్టాలంటూ అన్న వదిన వేధిస్తుండడంతో యువకుడు అదృశ్యమైన ఘటన KPHBలో చోటుచేసుకుంది. వంశీకృష్ణ (33), శాలిని దంపతులు కో లివింగ్ హాస్టల్లో నివాసం ఉంటున్నారు. వంశీకృష్ణ సొంత ఊరిలో తన సోదరుడితో కలిసి ఇంటి నిర్మాణం చేపట్టారు. దీని విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగగా EMI చెల్లించాలని ఒత్తిడి తేవడంతో ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమయ్యాడు.
News March 29, 2025
ఖైరతాబాద్: సిటీలో 20% వృథా అవుతున్న నీరు

వేసవిలో నగరంలో నీటి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే జలమండలి నగర వ్యాప్తంగా సరఫరా చేస్తున్న నీటిలో సుమారు 20% వృథా అవుతోంది. అంటే దాదాపు 95 మిలియన్ లీటర్లు (3.5 మిలియన్ గ్యాలన్లు) వేస్టేజ్ అవుతోంది. పైప్‌లైన్ల లీకేజీలు, అనధికార కనెక్షన్ల కారణంగా ఈ నీరు ఇలా అవుతోందని జలమండలి అధికారులు చెబుతున్నారు. 2% సరఫరా లోపం కాగా.. మరో 18% నీటి పంపిణీలో ఉన్న లోపాల కారణంగా వేస్ట్ అవుతోంది.
News March 29, 2025
HYD : రోజుకు 9వేల ట్యాంకర్ల బుకింగ్

నగరంలో నీటి ఎద్దడి రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇక ఉగాది, రంజాన్ పండగలు రావడంతో నీటి వినియోగం కొంచెం ఎక్కువైంది. ఈ క్రమంలో జలమండలి ట్యాంకర్లకు డిమాండ్ బాగా పెరిగింది. రోజుకు సగటున 9 వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నాయని, వాటిని 24 గంటల్లోపే సరఫరా పంపుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. నీటిని సాధ్యమైనంత పొదుపుగా వాడుకోవాలని అధికారులు నగర వాసులకు సూచిస్తున్నారు.24గం.హోమ్ డెలివరీ HYDలో భారీగా బుకింగ్స్