News June 15, 2024
HYD: రేపటి నుంచి రవీంద్రభారతిలో పెయింటింగ్ ఎగ్జిబిషన్
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతి శాఖ సౌజన్యంతో పికాసో ది స్కూల్ ఆఫ్ ఆర్ట్ విద్యార్థుల పెయింటింగ్ ఎగ్జిబిషన్ రేపటి నుంచి మూడు రోజుల పాటు HYD రవీంద్రభారతిలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల వారందరూ ఇందులో పాల్గొని ఎగ్జిబిషన్ చూడాలని కోరారు.
Similar News
News January 15, 2025
సంక్రాంతి వేళ సైబర్ మోసాలతో జాగ్రత్త: శిఖాగోయల్
సంక్రాంతి పండుగవేళ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖాగోయల్ సూచించారు. సైబర్ నేరగాళ్లు ఫేక్ షాపింగ్ ఆఫర్లు, పండుగ డిస్కౌంట్లు, నకిలీ వెబ్‌సైట్ల ద్వారా భారీ తగ్గింపు ధరలు చూపించి మోసం చేస్తారన్నారు. గిఫ్ట్ కార్డు మోసాలు, ఫేక్ ఈ-వ్యాలెట్లు, చెల్లింపుల కోసం నకిలీ యాప్‌లు, క్యూఆర్ కోడ్‌లు ఉపయోగిస్తారని పేర్కొన్నారు. హెల్ప్ కోసం 1930కి కాల్ చేయాలన్నారు.
News January 15, 2025
HYD: అప్పటి PV సింధు ఎలా ఉన్నారో చూశారా..?
ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అందరికీ సూపరిచితమే. ఆమె తన క్రీడా జీవితాన్ని ప్రారంభించిన తొలినాళ్ల జ్ఞాపకాలకు సంబంధించిన ఓ ఫొటోను Xలో ప్రముఖ ఎడిటర్ ట్వీట్ చేశారు. మొట్ట మొదటిసారిగా నేషనల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకున్న అనంతరం సికింద్రాబాద్ మారేడుపల్లిలోని ఆమె నివాసంలో దిగిన ఫోటో ఇది. నేడు దేశానికి ఎన్నో విజయాలు సాధించి, గొప్ప పేరు తెచ్చారని పలువురు ప్రశంసించారు.
News January 15, 2025
ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన: హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన పగా, ప్రతీకారంతోనే కొనసాగిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు, బెయిల్ వ్యవహారంపై ఇవాళ ఉదయం హైదరాబాద్ కోకాపేటలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.